
ఎన్టీఆరే ఓడిపోయారు... కేసీఆర్ ఎంత?
సినీ గ్లామర్, చరిష్మా ఉన్న ఎన్టీఆర్ వంటి నాయకుడే ఎమ్మెల్యేగా ఓడిపోయారని, నోరుతెరిస్తే అబద్ధాలు తప్ప ఏనాడూ నిజాలు మాట్లాడని ముఖ్యమంత్రి కేసీఆర్
అక్టోబర్‌లో పీసీసీ మార్పు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సినీ గ్లామర్, చరిష్మా ఉన్న ఎన్టీఆర్ వంటి నాయకుడే ఎమ్మెల్యేగా ఓడిపోయారని, నోరుతెరిస్తే అబద్ధాలు తప్ప ఏనాడూ నిజాలు మాట్లాడని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత అని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 65–70 సీట్లు వస్తాయని చెప్పారు.
అక్టోబర్‌లో పీసీసీలో మార్పు ఉంటుందని, సంస్థాగత ఎన్నికలు అందుకోసమేనని, పీసీసీ అధ్యక్ష స్థానం కోసం పోటీ చేస్తామని కోమటిరెడ్డి ప్రకటించారు. రాహుల్‌గాంధీని కలసి ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరి నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి, మంత్రి పదవులపై తనకు ఆసక్తి లేదని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. కాగా, మియాపూర్ భూముల్లో రూ.50 వేల కోట్ల స్కాం జరిగిందని, దీనిలోని సూత్రధారులను అరెస్టు చేయాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హోంమంత్రిని కోమటిరెడ్డి మంగళవారం కలిశారు.