తెలంగాణ సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ధిక్కరించేలా ఉన్నాయని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్ విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ధిక్కరించేలా ఉన్నాయని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్ విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ధిక్కరించడం క్రమశిక్షణా రాహిత్యమేనని చెప్పారు.
టీఆర్‌ఎస్‌కు మద్దతుగా కోమటిరెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టులు కావాలంటే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లొచ్చునని సూచించారు. అంతేకానీ కోవర్టు రాజకీయాలు చేయొద్దని శ్రవణ్ హితవు పలికారు.