న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులతో ఫోన్‌లో మాట్లాడారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తలెత్తిన పరిస్థితులపై వారితో చర్చించారు. ఆదివారం ప్రధాని మోదీ.. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్‌ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవెగౌడలతో కూడా ఫోన్‌లో సంభాషించారు. ఇంకా.. సమాజ్‌వాదీ పార్టీ అగ్ర నేతలు అఖిలేశ్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్‌తోనూ మాట్లాడారు. పార్లమెంట్‌లో వివిధ పక్షాల నేతలతో ప్రధాని మోదీ ఈనెల 8వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment