సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మో, బొమ్మో ఇవ్వలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం ద్వారా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నారని ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సోనియాగాంధీని ఉద్దేశించి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయనను కేసీఆర్ కంట్రోల్‌లో పెట్టాలని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ.. ‘ఉత్తమ్‌గారూ.. నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. 1952 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా తెలంగాణకు మోసాలు, ద్రోహలతో నిండి ఉంది. ప్రజా ఉద్యమానికి తలొగ్గి అనివార్య పరిస్థితుల్లోనే రాష్ట్రాన్ని ఇచ్చారు’ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
‘సోనియాగాంధీ దయ వల్లనే తెలంగాణ వచ్చింది. ఇది ఎవరన్నా కాదంటే.. వారు మూర్ఖులే.. సోనియా వల్లే తెలంగాణ వచ్చింది. ఇందులో ఎవరికీ అనుమానాలు అవసరం లేదు’ అంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పేర్కొన్న వీడియో లింక్‌ను ట్యాగ్ చేస్తూ.. మీ నాన్న వ్యాఖ్యలతో విభేదిస్తున్నారా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Pls watch KCR talking abt our leader Smt. Sonia Gandhi ji - “No one can disagree that Telangana was Sonia Gandhi Garu’s initiative. TS was created due to her benevolence. Whoever disagrees with this fact is a ‘మూర్ఖుడు‘.” R u disagreeing with your father? https://t.co/KFudkjgbmN https://t.co/D7QWX5wlh7
— Uttam Kumar Reddy (@UttamTPCC) 2 July 2018
Comments
Please login to add a commentAdd a comment