సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తప్ప మిగిలిన అన్ని బ్యారేజీలు నింపుతామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం(జులై 28) జలసౌధలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు.
‘కాళేశ్వరం లో మూడు బ్యారేజీలు తప్ప మిగతా అన్ని రిజర్వాయర్లను వాడుకుంటాం. కాళేశ్వరం నీళ్లు రాక ఉత్తర తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడితే దానికి కారణం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మూడు బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయి. కేటీఆర్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.
కేటీఆర్ జోసఫ్ గోబెల్స్ కి మించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో నీళ్లు ఆపితే జరిగే ప్రమాదానికి ఎవరు భాధ్యత వహిస్తారు. ప్రమాదం జరిగితే భద్రాచలం రాముడి గుడి కూడా మునుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా మూడు, నాలుగు టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన బ్యారేజీలు లేవు. ప్రచారం కోసం, కమిషన్ల కోసం పెద్ద బ్యారేజీలు కట్టి కుంగగొట్టారు. లక్ష కోట్ల కుంభకోణంలో కేసీఆర్ అండ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇరిగేషన్ శాఖలో ఇక నుంచి ఒక కొత్త చాప్టర్ మొదలు పెడుతున్నాం’అని చెప్పారు.
మంత్రి ప్రెస్‌మీట్‌లో మూడుసార్లు పవర్‌కట్..
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం జలసౌధలో మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా మూడుసార్లు కరెంటు పోయింది. గంట వ్యవధిలో మూడు సార్లు కరెంటు పోయింది. కరెంటు వెంటనే రాకపోవడంతో జనరేటర్‌తో మంత్రి ప్రెస్‌మీట్ నిర్వహించారు. పవర్ కట్ సమయంలో జలసౌధ భవనంలో పలువురు లిఫ్టులో ఇరుక్కుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment