నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే పేదలందరికీ ఇళ్ల స్థలాలతోపాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. సోమవారం స్థానిక మామిళ్లగూడెం ఇందిరమ్మ కాలనీలో హౌసింగ్ బోర్డు నిధులు *1.09 కోట్లతో నిర్మించనున్న సీసీరోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా సీసీ రోడ్లు మం జూరు చేయించామన్నారు. కంచనపల్లి సమీపంలో నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం 150 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు తెలిపారు. ఇళ్లకు కరెంటు బిల్లులు వేలల్లో వస్తున్నాయని కాలనీ మహిళలు తెలపడంతో ఎమ్మెల్యే ట్రాన్స్ కో ఎస్సీతో ఫోన్‌లో మాట్లాడి బిల్లులను సరిచేయించాలని ఆదేశించారు.
టీడీపీ వాళ్లు తెలంగాణ ద్రోహులు
తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతున్న సమయంలో తెలంగాణ రాకుండా అడ్డుకుంటున్న టీడీపీ నాయకులు తెలంగాణ ద్రోహులుగా మారారని, మానవత్వం లేని కమ్యూనిస్టులు మూర్ఖులుగా వ్యవహరిస్తున్నారని వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణకు అడ్డుపడుతున్న టీడీపీ, సీపీఎంల నాయకులను గ్రామాలకు రాకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిగూడెంలో 60 ఎకరాల భూమిలో నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించాలని నిర్ణయిస్తే కోర్టుకు వెళ్లి నిర్మాణం కాకుండా సీపీఎం నేతలు అడ్డుకున్నారని తెలిపారు. వెలుగుపల్లి, రసూల్‌పురం, మామిళ్లగూడెం గ్రామాల్లో అర్హులైన పేదల కోసం ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం స్థల సేకరణ చేస్తుంటే సీపీఎం నాయకులు అడ్డుతగులుతున్నారని విమర్శించారు.
పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తుంటే అసత్య అరోపణలు చే స్తూ ప్రజలకు మోసం చేస్తున్నారని చెప్పారు. కమ్యూనిస్టుల కుయుక్తులను ప్రజలు గమనించాలని కోరారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శరత్‌బాబు, నన్నూరి విష్ణువర్ధన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వంగూరు లక్ష్మయ్య, నాయకులు గుమ్ముల మోహన్‌రెడ్డి, బాబ, పెరికకిషన్, ఉడుత వెంకన్న, పనస శంకర్‌గౌడ్, దైద వెంకట్‌రెడ్డి, చింతల భిక్షం, మార్త యాదగిరిరెడ్డి, దైద శేఖర్‌రెడ్డి, గడ్డం అనూప్‌రెడ్డి, పెరిక మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
పేదలందరికి పక్కా ఇళ్లు
Published Tue, Dec 24 2013 4:14 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement