Cc roads
-
అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ... కమిషనర్‌ను ప్రశ్నిస్తున్న కౌన్సిలర్లు
సదాశివపేట(సంగారెడ్డి): మున్సిపల్ పరిధి రోజురోజుకు విస్తరించడంతోపాటు జనాభా పెరుగుతోందని, అయితే శానిటేషన్ నిర్వహణ అధ్వానంగా తయారైందని, లై అవుట్లలో రోడ్లు, లైట్లు తదితర పనులు పూర్తి కాకుండానే తుది అనుమతి ఎలా ఇస్తారని కౌన్సిలర్లు కమిషనర్ కృష్ణారెడ్డిని ప్రశ్నించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం అనంతరం అనధికారికంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు శానిటేషన్, లేఅవుట్లు, ఇతర అభివృద్ధి పనులు విషయంలో అధికారుల వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. పట్టణంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. మురుగు కాల్వల్లో పూడిక పెరుకుపోతుందని, పారిశుద్ధ్య నిర్వహణ ప్రైవేట్‌కు అప్పగించవద్దని 3వ వార్డు కౌన్సిలర్ చౌదరి ప్రకాశ్ చెప్పినట్లు సమాచారం. ప్రైవేట్ చెత్తసేకరణను రద్దుచేసి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో చేయించాలన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది చాలడంలేదని, సిబ్బంది సంఖ్యను పెంచాలన్నారు. పట్టణ పరిధిలో ఎన్ని లే అవుట్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని, లే అవుట్లలో రోడ్లు, మురుగునీటి కాల్వలు, వాటర్ ట్యాంకు నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా పైపులైన్ నిర్మించకుండా ఫైనల్ రిలీజ్ ఎందుకు చేస్తున్నారని కౌన్సిలర్ ఇంద్రమోహన్‌గౌడ్ కమిషనర్ కృష్ణారెడ్డిని ప్రశ్నించనట్లు తెలిసింది. లే అవుట్లలో అభివృద్ధి పనులు జరగకున్నా, ఇతర సౌకర్యాలు లేకున్నా ప్లాట్లు కొనుగోలు చేసినవారికి ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారని, నిబంధనల మెరకే లే అవుట్ ఫైనల్ చేస్తున్నామని కమిషనర్ సమాధానమిచ్చినట్లు సమాచారం. సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణ పనులు నాణ్యతా జరగడంలేదని కౌన్సిలర్లు నాగరాజ్‌గౌడ్, చౌదరి ప్రకాశ్ నిలదీశారని, నాణ్యతగా పనులు చేపట్టేందుకు ఇంజనీర్‌ను ఆదేశిస్తామని కమిషనర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. మూడు నెలలకోసారి కాకుండా ప్రతీనెల సమావేశాలు నిర్వహిస్తే ప్రజాసమస్యలు సులువుగా పరిష్కారమవుతాయని మెజార్టీ కౌన్సిలర్లు కోరినట్లు సమాచారం. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు విద్యాసాగర్‌రెడ్డి, గుండు రవి, శ్రీనివాస్, ఇలియాస్ షరీఫ్, నాగరాజ్‌గౌడ్, గుండు రవి, ఖుద్దూస్, పిచర్యాగడి రేణుక, కోఆప్షన్ మెంబర్ కలీమ్ పటేల్ పాల్గొన్నారు. -
‘గడపగడపకూ’ అభివృద్ధి
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): స్థానిక సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సమస్యలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు ప్రభుత్వం సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం (జీజీఎంపీ) పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు గడపగడపకు కార్యక్రమంలో భాగంగా వారి దృష్టికి వచ్చిన మౌలిక వసతుల సమస్యలను గుర్తించి ఆయా పనులకు తీర్మానం చేయించి జీజీఎంపీ పనుల్లో నిధులు మంజూరు చేయించి త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏఏ పనులంటే.. సచివాలయ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20 లక్షలతో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, పారిశుద్ధ్య, లైటింగ్ తదితర పనులు చేపడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అత్యవసరమైన పనులకు ముందుగా ప్రాధాన్యమిస్తూ నిధులను వెచ్చిస్తున్నారు. 22.05 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు జిల్లావ్యాప్తంగా జీజీఎంపీ నిధులతో 22.05 కిలోమీటర్లు మేర సీసీ రోడ్లు మంజూరు చేయగా ఇప్పటివరకు 8.02 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. సీసీ రోడ్లకు సంబంధించి మొత్తం 414 పనులు చేపట్టగా 95 పనులు పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా 1,035 పనులు జిల్లాలో ఇప్పటివరకూ 1,035 పనులు మంజూరు చేయగా 837 పనులు జరుగుతున్నాయి. సుమారు 100 పనులు పూర్తయ్యాయి. మరో 158 పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలోని 19 మండలాలు, 6 మున్సిపాలిటీల్లో పనులు 80 నుంచి 90 శాతం మేర పురోగతిలో ఉన్నాయి. జీజీఎంపీ నిధులు మైనర్ పంచాయతీలకు వరంలా మారాయి. ఆయా నిధులతో మౌలిక వసతులు కల్పించడంతో గ్రామంలో సమస్యలు పరిష్కారమవుతున్నాయి. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. శాఖల వారీగా పనులు ఇలా.. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 466 పనులు మంజూరు కాగా 424 పనులు చేపట్టారు. 42 పనులు చేపట్టాల్సి ఉంది. ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా 172 పనులు మంజూరు కాగా 158 పనులు చేపట్టారు. 14 పనులు చేపట్టాల్సి ఉంది. విద్యుత్ శాఖ ద్వారా 5 పనులు మంజూరు కాగా 3 పనులు చేపట్టారు. 2 పనులు చేపట్టాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో 392 పనులు మంజూరు కాగా 184 పనులు జరుగుతున్నాయి. 108 పనులు చేపట్టాల్సి ఉంది. రోడ్డు, డ్రెయిన్ నిర్మాణం ప్రభుత్వం మా గ్రామ సచివాలయానికి రూ.20 లక్షలు మంజూరు చేసింది. గడపగడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి జీజీఎంపీ నిధులతో సీసీ రోడ్డు, డ్రెయిన్, కల్వర్ట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. మూడు పనులు జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – వీరవల్లి శ్రీనివాస్, సర్పంచ్, తోకలపూడి జిల్లావ్యాప్తంగా పనులు జిల్లావ్యాప్తంగా జీజీఎంపీ పనులు జరుగుతున్నాయి. సీసీ, గ్రావెల్ రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టాం. కలెక్టర్ ఆదేశాలు, సలహాల మేరకు వేగంగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో సుమారు 100 పనులు పూర్తికాగా 837 పనులు సాగుతున్నాయి. వీటిని వేగంగా పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నాం. – కేఎస్ఎస్ శ్రీనివాస్, జిల్లా పంచాయతీరాజ్ ఈఈ, భీమవరం -
భవానీపురం స్టేడియంను త్వరితగతిన పూర్తి చేస్తాం: వెల్లంపల్లి
సాక్షి, కృష్ణా: విజయవాడ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఆయన శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రూ.కోటి 40 లక్షలతో సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన గడపగడపకు వెళ్లి ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించారని వెల్లంపల్లి తెలిపారు. భవానీపురం స్టేడియంను త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. -
బయట పడనున్న టీడీపీ నేతల బండారం
అరసవల్లి: ‘‘ఊరూరా సీసీరోడ్లు వేశాం... అభివృద్ధి చేసి చూపించాం...’’ అని ఊదరగొట్టిన తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు, గ్రామ పంచాయతీల నిధుల సంయుక్త వినియోగంతో వేసిన ‘చంద్రన్న బాట’ల నాణ్యతా ప్రమాణాల పని పట్టేందుకు ఓ వైపు క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో జిల్లాలో ఇంజినీరింగ్ అధికారులతోపాటు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన టీడీపీ నేతల బండారం బయట పడనుంది. చంద్రన్న బాటలిలా.... జిల్లాలో చంద్రన్న బాటల నిర్మాణంలో భాగంగా 100 నుంచి 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో 90 శాతం ఉపా«ధి నిధులు, 10 శాతం పంచాయతీ నిధులతో కలిపి సీపీ రోడ్లు వేశారు. జనాభా 2,001–4,999 మధ్య ఉన్న పంచాయతీల్లో 70 శాతం ఉపాధి నిధులు, 30 శాతం పంచాయతీ నిధులు, 5 వేలకు మించిన జనాభా ఉన్న పంచాయతీల్లో సగం ఉపాధి నిధులు, మిగిలిన సగం పంచాయతీ నిధులతో సీసీరోడ్లు నిర్మించారు. ఈ క్రమంలో 2014–15 నుంచి 2018–19 వరకు జిల్లాలో 1,460 కిలోమీటర్ల మేర సీసీరోడ్లు నిర్మించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 2018 అక్టోబర్ 1 నుంచి 2019 మే 31వ తేదీ వరకు రూ.132 కోట్లుతో 350 కిలోమీటర్లు మేర సీసీరోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం రూరల్ మండలం కాజీపేట, కిల్లిపాలెం, చాపురం తదితర పంచాయతీల్లో రోడ్లపై రోడ్లు వేసినట్లుగా అధికారులు గుర్తించారు. వీటి లెక్కలు తేల్చాలని నిర్ణయించారు. బిల్లులు చెల్లింపులపైనా విజిలెన్స్...! జిల్లాలో గత ఐదేళ్లలో 1,460 కిలోమీటర్ల సీసీరోడ్లలో దాదాపుగా టీడీపీ నేతలు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి గ్రామీణ ప్రాంతాలకు అనుసంధాన రోడ్లు పేరిట ఇష్టానుసారంగా సీసీరోడ్లు నిర్మించి లక్షలాది రూపాయలు బొక్కేశారు. ఇక్కడ నాణ్యతను అప్పటి అధికారులు పక్కనపెట్టి ఇస్టానుసారంగా క్లియరెన్స్ ఇచ్చి బిల్లులు చెల్లించారని తెలుస్తోంది. ఇందులో ఇంకా బిల్లులు చెల్లించాల్సిన పనుల విషయంలోనైనా ప్రత్యక్షంగా నాణ్యతను పరిశీలించిన తర్వాతే బిల్లులు చెల్లించాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల ప్రకారం జీవో 271 ప్రకారం నిర్మాణ పనులను క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది నూటికి నూరు శాతం పనులన్నీ పరిశీలించిన తర్వాతే బిల్లులు చెల్లించాల్సి ఉంది. తనిఖీల్లో భాగంగా ప్రతి రోడ్డుకు కోర్ కటింగ్ శాంపిళ్లను సేకరించి పరీక్షలు చేసిన తర్వాత నాణ్యతను గుర్తించాల్సి ఉంది. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రోజుల్లో వీటి నిర్మాణాలు మరింత దూకుడుగా సాగిన విషయం తెలిసిందే.. శ్రీకాకుళం రూరల్‌తో పాటు ఆమదాలవలస, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, రాజాం, ఎచ్చెర్ల తదితర నియోజకవర్గాల్లో రోడ్లుపై రోడ్లు వేసి మరీ బిల్లులు పెట్టేశారనే సమాచారం అ«ధికారుల వద్ద ఉంది. దీనిపై విజిలెన్స్ రంగంలోకి దిగడంతో త్వరలో బండారం బయటపడనుంది. రూ.132 కోట్ల పనులపై 10 బృందాల తనిఖీలు.. జిల్లాలో ఉపాధి నిధులు, పంచాయతీ నిధులను సంయుక్తంగా వినియోగించి నిర్మించిన చంద్రన్న బాట సీసీరోడ్లలో అవినీతి అక్రమాల లెక్క పనిలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు పడ్డారు. ఐదారు రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖల క్వాలిటీ కంట్రోల్ అధికారులంతా మొత్తం 10 బృందాలుగా తనిఖీలు చేపడుతున్నాయి. డ్వామా పీడీ ఆధ్వర్యంలో ఈ బృందాలు ఇప్పటికే పలు గ్రామ పంచాయతీల్లో సీసీరోడ్ల నాణ్యతను పరీక్షిస్తున్నాయి. ఈప్రక్రియ అంతా త్వరితగతిన పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ జే నివాస్ ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో చంద్రన్న బాట సీసీరోడ్ల నాణ్యతను పరీక్షించేందుకు ముందుగా క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విజిలెన్స్ అధికారులకు ఆయా రోడ్లకు సంబంధించిన రికార్డులు సమర్పించాం. రెండు దఫాలుగా తనిఖీలు పూర్తయిన తర్వాత ఉన్నతా««ధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. – ఎస్ రామమోహన్‌రావు, పీఆర్ ఎస్ఈ, శ్రీకాకుళం -
సరిహద్దు గ్రామం.. అభివృద్ధికి దూరం
తానూరు: మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఎల్వత్ గ్రామంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కనీస సౌకర్యాలైన అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు లేక గ్రామస్తులు ఇ బ్బందులెదుర్కొంటున్నారు. గ్రామం మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో అధికారులు అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో దశాబ్దాలుగా ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవీ సమస్యలు.. తానూరు మండలంలో ఉన్న ఎల్వత్ గ్రామం మ హారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర కిలోమీటరు దూరంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే మహారాష్ట్రలోని ధర్మాబాద్ వెళ్లి అక్కడి నుంచి ఆ గ్రామానికి వెళ్లాల్సి వస్తుంది. గ్రామంలో అంతర్గత రోడ్లు, మురుగు కాలవలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యూకాలనీలో మురుగు కాలువలు లేకపోవడంతో స్థానికులు వాడిన మురుగు నీరు రోడ్డుపై ప్రవహించి రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. గ్రామంలో మురుగు కాలువలు లేక పోవడంతో పాత గ్రామం నుంచి మురుగు నీరు న్యూకాలనీలో చేరుతోంది. కాలనీలో గతంలో సీసీ రోడ్డు నిర్మించిన మురుగు కా లువలు ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు వాడిన మురుగు నీరు ఇంటి పరిసర ప్రాంతంలో నిల్వ ఉంటోంది. పాలకులు మారినా తమ గ్రామంలో ఉన్న సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి పథకాలు నిరుపయోగం ఎల్వత్ గ్రామంలో గత 8 సంవత్సరాల క్రితం రూ. 23 లక్షలతో రక్షత మంచి నీటి పథకం నిర్మించి అంతర్గత పైప్‌లైన్ పనులు పూర్తిచేశారు. మోటారు ఏర్పాటు చేయకపోవడంతో నిర్మించిన పథకం ప్రారంభానికి నోచ్చుకోక నిరుపయోగంగా మారింది. దీంతో గ్రామస్తుల తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు పథకం ప్రారంభించి తాగు నీటి సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు.కాలనీలో ఉన్న సింగిల్ ఫేజ్ మోటారుకు పైప్‌లు ఏర్పాటు చేసుకుని నీటిని తీసుకుంటున్నారు. రూ. లక్షలు ఖర్చుచేసి నిర్మించిన పథకంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పథకం నిరుపయోగంగా మారింది. అధికారులు బోరుమోటారు ఏర్పాటు చేసి పథకం ఉపయోగంలో తీసుకువస్తే గ్రామస్తుల తాగు నీటి సమస్య పరిష్కారం అవుతుంది. నాసిరకంగా సీసీ రోడ్ల పనులు ఎనిమిది సంవత్సరాల క్రితం న్యూకాలనిలో అధికారులు రూ.లక్షలు ఖర్చుచేసి సీసీ రోడ్డు పనులను చేపట్టారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వేయడంతో రోడ్లు పగుళ్లు తేలి, గుంతలు పడి అధ్వానంగా మారి నడవలేని స్థితిలో ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక సంబందిత కాంట్రాక్టర్ ఇష్టరాజ్యంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు. సీసీ రోడ్లు నిర్మించిన అధికారులు డ్రైనేజీలు నిర్మించకపోవడంతో మురికి నీరు రోడ్డుపై పారుతోంది. ఈ విషయంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పచ్చని చెట్లతో ఆహ్లాదం
వేములవాడఅర్బన్ : వేములవాడ అర్బన్ మండలంలోని నాంపల్లిలోని శాంతినగర్ కాలనీలో 2017లో హరితహారం కార్యక్రమంలో కాలనీవాసులు కాలనీలోని సీసీ రోడ్డుకు ఇరువైపుల గన్నేరు మొక్కలను నాటుకున్నారు. ఎండాకాలంలో కూడా వాటిని ఎవరి ఇంటి ఎదుట వారు నీరు పెట్టుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆ చెట్లు పెరిగి ఇప్పుడు ఆ కాలనీలో గన్నేరు పూలతో, పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కాలనీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ చెట్లను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
సీసీ రోడ్లు నిర్మించాలని ఆత్మహత్యాయత్నం
జైపూర్(చెన్నూర్) : అవసరం లేని చోట సీసీ రోడ్లు నిర్మిస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, ప్ర జలకు ఉపయోగడే విధంగా వీధుల్లో సీసీ రోడ్లు ని ర్మించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని నర్వ గ్రామానికి చెందిన దూట నాగరాజు సోమవారం ఉదయం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు సమీప ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా సీఎస్ఆర్ నిధులు రూ.73లక్షల ద్వారా నర్వ గ్రామంలో అంతర్గ త రోడ్లు నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్లు నిర్మించి ఉన్నప్పటికీ నిధులు మంజూరు చేశారని, మరి కొ న్ని చోట్ల అవసరం లేకున్నా రోడ్లు మంజూరు అ య్యాయని, ప్రజలకు ఉపయోగడే విధంగా వీ ధుల్లో సీసీ రోడ్డు నిర్మించాలని అధికారులను, కాం ట్రాక్టర్‌ను కోరాడు. ఈ క్రమంలో కాంట్రాక్టర్‌కు నాగరాజుకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాంట్రాక్టర్ బెదిరింపులకు పాల్పడ్డారని మనస్తా పం చెందిన నాగరాజు పెట్రోల్ పోసుకోగా, స్థానికులు అప్రమత్తమై అడ్డుకున్నారు. అతడిని 108లో మంచిర్యాల ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. -
నాణ్యతకు పాతర
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లాలో మినీ మేడారంగా పిలిచే అగ్రంపహాడ్ జాతర పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. జాతరలో ప్రతి ఏడాది 10లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా సీసీ రోడ్డు వేస్తున్నారు. అటు నిర్మిస్తున్నారో లేదో.. ఇటు రోడ్డుకు పగుళ్లు ప్రారంభమయ్యాయి. అక్కంపేట నుంచి దుర్గంపేట వరకు 6.2 కిలో మీటర్లు ఉంటుంది. గతంలో అగ్రంపహాడ్ నుంచి సమ్మక్క–సారలమ్మ గద్దెల వరకు సింగిల్ రోడ్డు ఉండేది. దీంతో జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురయ్యేవారు. డబుల్ రోడ్డు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రూ.9కోట్లు కేటాయించింది. రోడ్డు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జాతర సమీపిస్తున్నా పనులు పూర్తి కాలేదు. సీసీ రోడ్డు పోసిన తరువాత మట్టితో కట్టలు కట్టి నీటి ద్వారా క్యూరింగ్ చేయాల్సిం ఉంటుంది. మట్టి కట్టలకు బదులు గోనెతట్లు వేసి నీటిని చల్లుతున్నారు. దీంతో క్యూరింగ్ సక్రమంగా కాకపోవడంతో అప్పుడే పగుళ్లు ఏర్పడుతున్నాయి. పనులను పర్యవేక్షించాల్సిన రోడ్లు భవనాల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రా క్టర్ ఇష్టారాజ్యంగా నాణ్యత లేకుండా పనులు చేపడుతున్నట్లు పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి పనులను పర్యవేక్షించి నాణ్యతగా చేపట్టేలా చూడాలని కోరుతున్నారు. -
ఇదేం న్యాయం?
♦ ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.85.31కోట్లతో సీసీ రోడ్లు ♦ పంచాయతీ తీర్మానాలు లేకుండానే ఎంపీ, ఎమ్మెల్యేల సిఫారసులు ♦ పనులు తమకే అప్పగించాలంటున్న సర్పంచులు ♦ రోడ్ల నిర్మాణానికి మార్చి 31వరకే గడువు ఆదిలాబాద్ కల్చరల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్ ఆర్ఈజీఎస్ 20:80 అభివృద్ధి పనులు అభాసుపాలవుతున్నాయి. సర్పంచ్ తీర్మానం లేకుండానే కార్యకర్తల పేరుతో ప్రజాప్రతినిధులు పనులు చేసి సర్పంచులకు మొండిచేయి చూపిస్తున్నారు. కొన్ని గ్రామపంచాయతీల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు 20 శాతం నిధులు కేటాయించి తమకు అనుకూలమైన కార్యకర్త పేరును పంచాయతీ ఇంజినీర్లకు సిఫారసు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గ్రామపంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఈ పనులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నా ప్రజాప్రతినిధులు సిఫారసులతో నిరాశ చెందుతున్నారు. అభివృద్ధి పనులు 20 శాతం వెచ్చించి ఇష్టారాజ్యంగా కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరించడంపై ప్రజాగ్రహం కనిపిస్తోంది. ఇది గ్రామ పంచాయతీలో ప్రతిపక్ష సర్పంచులు ఉన్న ప్రాంతంలో ఈ సిఫారసుల తంతు ఎక్కువగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. నిధులు సమకూరేదిలా.. 20:80 పథకంలో 20శాతం స్థానిక పంచాయతీ, ఎమ్మెల్యేలు, ఎంపీ నిధుల నుంచి గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ పథకం నుంచి 80 శాతం నిధులు గ్రామాభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణానికి వెచ్చిస్తోంది. నిజానికి 20 శాతం గ్రామపంచాయతీలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో చెల్లించి 80 శాతం నిధులు సమకూర్చుకునేందుకు గ్రామపంచాయతీల తీర్మానాన్ని తీసుకోలేదు. 20శాతం నిధులు చెల్లించడానికి ముందుకు వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులే చెల్లిస్తున్నారని, గ్రామ పంచాయతీలకు సంబంధం లేకుండా సంబంధిత ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉన్న ఏరియాలో పనులు చే పడుతున్నారు. ఉపాధిహామీ పథకం నిబంధనల ప్రకా రం ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వా ల్సి ఉండగా ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. గ్రామసభల ద్వారా పంపిన పనులను పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో కేటాయించిన నిధులు.. పనులు ఉపాధిహామీ పథకంలోని 20:80 ప్రకారం ఉమ్మడి జిల్లాలో రూ.85.31కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 875 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.23 కోట్లు, కుమురం భీం జిల్లాలో 471 పనులకుగాను రూ.19.57 కోట్లు, నిర్మల్ జిల్లాలో 444 పనులకు రూ.20.33 కోట్లు, మంచిర్యాలలో 530 పనులకు రూ.22.41 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.68 కోట్ల 24 లక్షల 80 వేలు సమకూర్చగా, ఎంపీ, ఎమ్మెల్యే, జీపీల నిధులు రూ.17 కోట్ల 6 లక్షల 20 వేలు 20 శాతం కింద జమ చేయాల్సి ఉంది. సర్పంచులకు మొండిచేయి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అభివృద్ధి నిర్మాణ పనులు నిర్వహించాల్సిన ఈ పనుల్లో కొందరు సర్పంచులకు మొండిచేయి చూపుతున్నారు. 20శాతం నిధులు వెచ్చించిన ఎమ్మెల్యే, ఎంపీలను తమకు అనుకూలంగా కార్యకర్తల పేర్లను అధికారులకు సిఫారసు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో గ్రామ పంచాయతీ తీర్మానించే సర్పంచ్, వార్డు మెంబర్ల పరిస్థితి అయోమయంలో పడింది. కొందరు సర్పంచులు ఈ తీర్మానానికి అంగీకరించలేని పరిస్థితులు కనిపించగా, తాము సిఫారసు చేసిన వ్యక్తిని పనులు చేయనీయని పక్షంలో 20 శాతం నిధులను చెల్లించమనే పరోక్ష సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో సర్పంచులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల విధి విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ముంచుకొస్తున్న గడువు ప్రభుత్వం నిర్వహించే 20 : 80 పనులకు గడ్డుకాలం ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం ఇచ్చిన ఉత్తర్వులతో ఇప్పటివరకు ఒకటి రెండు పనులు మినహా ఎక్కడా ప్రారంభం కాలేదు. మార్చి 31లోపు ఈపనులు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ సర్పంచులు ఇంకా పనులు ప్రారంభించలేదు. గడువు ముగుస్తుందని వేగవంతంగా పనులు చేస్తే నాణ్యత లోపాలు ఏర్పడే అవకాశాలున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. -
ముసురు వర్షంతో చిత్తడి
వర్గల్: వాన ముసురుతో మండలం చిత్తడిగా మారింది. ఏ గ్రామంలో చూసినా బురదతొక్కితే తప్ప కాలు కదపలేని పరిస్థితి. ఇటీవల జరిగిన మిషన్ భగీరథ పనుల కారణంగా సీసీ రోడ్లు దెబ్బతినడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. వర్గల్, గుంటిపల్లి, మజీద్‌పల్లి, పాతూరు, నెంటూరు, మైలారం, సింగాయపల్లి, శేరిపల్లి తదితర గ్రామాల్లో వీధులు అధ్వానంగా మారాయి. రెయిన్ గేజ్ లెక్కల ప్రకారం మండలంలో మంగళవారం ఉదయం వరకు 8.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అడపాదడపా కురిసిన జల్లులతో పత్తి, కంది తదితర పప్పు ధాన్యాల పంటలకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
హుజూర్నగర్ : నగరపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు చైర్మన్ జక్కుల వెంకయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని 3వ వార్డులో రూ.3 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్, నగరపంచాయతీ వైస్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 20 వార్డుల పరిధిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అంతర్గత రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తన్నీరు మల్లికార్జున్‌రావు, దొంతిరెడ్డి సంజీవరెడ్డి, కంకణాల పుల్లయ్య, శాఖ గ్రంథాలయ చైర్మన్ కె.సైదులు, నాయకులు కామిశెట్టి రవికుమార్, వల్లపుదాసు కృష్ణ, చింతకాయల రాము, నందిగామ శంభయ్య, యల్లావుల రాములు, కాలవపల్లి బ్రహ్మారెడ్డి, యతిపతిరావు, నర్సింహారావు పాల్గొన్నారు. -
గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు
విజయనగరం మున్సిపాలిటీ: పంచాయతీలకు వివిధ గ్రాంట్ల కింద మంజూరయ్యే నిధులతో పాటు వాటి ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయడంలో రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణరాజు తెలిపారు. జిల్లాలో మొత్తం 490 క్లస్టర్లు ఉండగా... అందులో 231 క్లస్టర్లలో వివరాలను ఆన్లైన్ చేసేందుకు అవసరమైన కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. ప్రశ్న: గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు? జవాబు: జిల్లావ్యాప్తంగా 920 గ్రామ పంచాయతీలు ఉండగా... అందులో 905 పంచాయతీల్లో సిమెంట్ రోడ్లు వేసే ప్రక్రియను చేపడుతున్నాం. మిగిలిన 15 పంచాయతీలు గిరిశిఖర గ్రామాలు కావటంతో ఆ ప్రాంతాల్లో పనులు చేపట్టడం లేదు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగే రోడ్ల నిర్మాణాలకు రూ.65 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 14వ ఆర్థిక సంఘం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాల్లో ఈ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రశ్న: ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతోంది.. పన్నుల వసూళ్ల పరిస్థితి..? జ: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి పన్ను, పన్నేతర ఆదాయం కింద రూ.23 కోట్లు వసూలు కావాల్సి ఉంది. మార్చి 31 నాటికి వసూలు చేయాలని 496 పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రస్తుతం ఈ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ప్రజలు కూడా సహకరించి స్వచ్ఛందంగా పన్నులు చెల్లించాలి. ప్రశ్న: గ్రామ పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ ఎంతవరకు వచ్చింది..? జ: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణకు సంబంధించి తొలి విడతగా 34 మండల కేంద్రాల్లో డంపింగ్ యార్డులను ఏర్పాటుచేస్తున్నాం. అందులో 12 మండలాల్లో పనులు ప్రగతిలో ఉన్నాయి. 920 గ్రామ పంచాయతీలకు 560 పంచాయతీల్లో డంపింగ్‌యార్డుల ఏర్పాటుకు స్థల సేకరణ జరిగింది. ప్రశ్న: పంచాయతీల పాలన పర్యవేక్షించేందుకు కార్యదర్శులు, ఈఓపీఆర్డీల పరిస్థితి? జ: జిల్లాలో 34 మండలాలు ఉన్నాయి. 29 మంది ఈఓపీఆర్డీలు ఉన్నారు. మిగిలిన ఐదు మండలాల్లో ఇన్ఛార్జిలుగా పక్క మండలాలకు చెందిన వారికి బాధ్యతలు అప్పగించాం. మొత్తం 920 గ్రామ పంచాయతీలను 490 క్లస్టర్లుగా విభజించాం. 496 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. నవంబర్ నెలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తులు ఆహ్వానించాం. 21 మంది కార్యదర్శుల పోస్టులకు ఎంపికయ్యారు. వారికి త్వరలోనే బాధ్యతలు అప్పగిస్తాం. ప్రశ్న: ఏకగ్రీవ పంచాయతీలకు విడుదలైన నిధుల వినియోగంపై మార్గదర్శకాలు! జ: జిల్లాలో 126 గ్రామ పంచాయతీలు ఎన్నికల నిర్వహణ లేకుండానే ఏకగ్రీవమయ్యాయి. వాటిలో ఒక్కో పంచాయతీకి రూ.7 కోట్లు చొప్పున మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆయా గ్రామ పంచాయతీల్లో జన్మభూమి కార్యక్రమంలో 20 ప్రాధాన్యతాంశాల పనులు చేపట్టాలని ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ట్రెజరీ అధికారులకు అవే సూచనలు పంపించాం. ప్రశ్న: నగర పంచాయతీలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారా? జ: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎస్.కోట, చీపురుపల్లి, కొత్తవలస మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్పు చేసేందుకు గత డిసెంబర్ 2వ వారంలోనే ప్రతిపాదనలు పంపించాం. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ ఇప్పటి వరకూ రాలేదు. -
'ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా లేదు'
విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో తాగునీటి సరఫరా లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. వచ్చే నాలుగేళ్లలో రూ.4వేల కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. 927 పంచాయతీల్లో డంపింగ్ యార్డులు నిర్మాణం చేపడతామని తెలిపారు. అదే విధంగా 782 గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా పనులు చేపడతామని మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా చెప్పారు. -
ఎమ్మిగనూరు ఆదర్శం
కర్నూలు సిటీ: జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గం రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు, అంతర్గత రహదారులన్నీ సీసీ రోడ్లతో కళకళలాడనున్నాయి. ఇంటింటికీ మరుగుదొడ్డితో, ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా రోజుకు 40 లీటర్ల తాగునీటిని కూడా సరఫరా చేయనున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో మాతాశిశు మరణాల మాటే ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. జిల్లాలోనే ఆదర్శ నియోజకవర్గంగా రూపుదిద్దుకోనుంది. ఆ మేరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలు ఇప్పటికే కలెక్టర్ వద్దకు చేరాయి. రాష్ర్టంలోని ప్రతి జిల్లాలో ఓ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో కుప్పంను ఎంపిక చేశారు. ఇదే తరహాలో జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు జిల్లా పరిషత్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం అమోద ముద్ర వేసిందంటే.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామాలకు బీటీ రోడ్లు, అంతర్గత రోడ్లన్నీ సీసీ రోడ్లతో కళకళలాడటంతో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక, మాద్యమిక, ఉన్నత పాఠశాలలన్నింటికీ తాగు నీరు, మరుగుదొడ్ల సదుపాయం కల్పించనున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించనున్నారు. క్రీడాకారులకు మంచి కోచ్‌లతో ఆయా క్రీడల్లో శిక్షణనిచ్చేందుకు ప్రత్యేకంగా బహుళ ఉపయోగ(మల్టీపర్పస్) క్రీడా స్టేడియం అందుబాటులోకి రానుండటం విశేషం. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే బి.వి.జయనాగేశ్వరరెడ్డి ప్రత్యేక చొరవ చూపినట్లు తెలుస్తోంది. ఆదర్శ నియోజకవర్గం వల్ల వచ్చే ప్రయోజనాలు ఇవీ.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మాతా, శిశు మరణాలు పూర్తి స్థాయిలో తగ్గించడం. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు స్వచ్ఛమైన తాగు నీరు, బాలబాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించడం. ప్రాథమాక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల్లో మధ్యలోనే బడి మానేసే విద్యార్థుల సంఖ్యను జీరోకు తీసుకురావడం. వయోజనులందరిలో 100 శాతం అక్షరాస్యత సాధించి, వారి ఉపాధికి ఆయా వృత్తుల వారికి వివిధ రంగాల్లో నిపుణులచే శిక్షణ ఇప్చించడం. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి, కుబుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించి, వేస్టేజ్‌ను శాస్త్రీయ 100 శాతం స్వఛ్చ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలతో సహా ప్రతి ఒక్కరికీ రోజు కు 40 లీటర్ల చొప్పున తాగు నీటిని సరఫరా. వ్యవసాయంలో ఆధునీక పద్ధతులను ఉపయోగించి గతంలో పండించే పంటల దిగుబడిని రెండింతలు చేసేందు కు రైతులకు ప్రత్యేక రాయితీ. రాబోయే రెండేళ్ల కాలంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయల నుంచి నియోజకవర్గ కేంద్రానికి బీటీ రోడ్లతో అనుసంధానం చేయడం. అదేవిధంగా పంచాయతీల్లో అన్ని వీధులకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం. నియోజకవర్గంలోని నిరుద్యోగులకు సరైన నైపుణ్యాలపై శిక్షణనిచ్చేందకు ప్రత్యేక నైపుణ్య కేంద్రాల ఏర్పాటు. క్రీడాకారులకు మంచి శిక్షణనిచ్చి.. ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసం బహుళ ప్రయోజన క్రీడామైదానాన్ని నిర్మించడం. ఆదర్శ నియోజకవర్గంగా ఎమ్మిగనూరు ఎంపికకు ప్రతిపాదనలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదించాం. ఈ ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్‌కు ఇటీవలే సమర్పించాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల దీనికి ఇప్పటి వరకు ఆమోదముద్ర పడలేదు. త్వరలోనే నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్రణాళిక సిద్ధం చేస్తాం. -బి.ఆర్.ఈశ్వర్, జిల్లా పరిషత్ సీఈఓ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా ఎమ్మిగనూరు ‘ఆదర్శ’ నియోజకవర్గంగా ఎంపికవుతోంది. ఇకపై నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలను చేరవ చేస్తాం. వంద శాతం అక్షరాస్యత సాధించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ప్రతి గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఫిర్యాదుల కేంద్రాన్ని త్వరలో ప్రారంభించనున్నాం. ముఖ్యంగా సాగునీటి సమస్యను పరిష్కరించి ఆయకట్టుదారులందరికీ న్యాయం చేస్తాం. -బి.వి.జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే -
ఇక్కడా అన్యాయమే!
ఉమ్మడి పాలనలో తెలంగాణ రోడ్లను మోటబుల్గా చూపిన వైనం ఫలితంగా ఇప్పటికీ కేంద్రం నుంచి రాని పీఎంజీఎస్‌వై నిధులు తాజా సర్వేలో 14,884 కి.మీ.ల అన్మోటబుల్ రోడ్లను గుర్తించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల్లోనే కాదు.. రహదారుల నిర్మాణంలోనూ సమైక్య పాలనలో తెలంగాణకు అన్యాయమే జరిగిందని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. గతంలో పనిచేసిన అధికారుల పక్షపాత వైఖరి ఫలితంగా.. ఈ ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అందకుండా పోయాయని లెక్కతేల్చింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) కింద ఏటా గ్రామీణ రహదారుల నిర్మాణం నిమిత్తం ప్రతి రాష్ట్రానికి నిధుల కేటాయింపు ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ రహదారుల్లో మోటారు వాహనాలు తిరిగేందుకు వీలుకాని మట్టి రోడ్లను వాహన యోగ్యం (మోటబుల్)గా మార్చేందుకు మాత్రమే ఈ నిధులు మంజూరు చేస్తారు. అయితే, ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతంలోని రోడ్లన్నీ వాహనాలు తిరిగేందుకు వీలైనవే (మోటబుల్)నంటూ గతంలో ఉన్నతాధికారులు, పాలకులు నివేదికలు ఇవ్వటంతో తెలంగాణకు పీఎంజీఎస్‌వై నిధులను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని ఉన్నతాధికారులు చెప్పారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన సర్వేలో ఈ అన్యాయం వెలుగులోకి వచ్చిందని వారు వివరించారు. తరలిపోయిన‘పీఎంజీఎస్‌వై’ నిధులు ఏటా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లోని రహదారులనే వాహనాలు తిరిగేందుకు యోగ్యం కానివి(అన్ మోటబుల్)గా చూపడంతో, కేంద్రం నుంచి వచ్చే పీఎంజీఎస్‌వై నిధుల్లో అధికమొత్తం ఆయా ప్రాంతాలకే తరలిపోయాయన్నది కాదనలేని నిజం. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రహదారుల సర్వేలో తెలంగాణలోని గ్రామీణ రహదారుల్లో ఇంకా 14,884 కిలోమీటర్ల మేర అన్మోటబుల్ రోడ్లు ఉన్నాయని అధికారులు తేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22,210 రహదారులు 64,044 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఇందులో 1,896 కిలోమీటర్ల మేర ఇతర జిల్లాల రహదారులు, 1,425 కిలోమీటర్లు మండల రహదారులు కాగా, 60,723 కిలోమీటర్ల గ్రామీణ రహదారులున్నట్లు సర్వేలో తేల్చారు. ఆయా రహదారుల్లో 1,717 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 18,564 కిలోమీటర్లు తారు రోడ్లు, 14,146 కిలోమీటర్లు కంకర(మెటల్) రోడ్లుగా పేర్కొన్నారు. కంకరలేని మట్టి రోడ్లలో వాహనాలు తిరిగేందుకు వీలైన రహదారులు 14,734 కిలోమీటర్లు ఉండగా, వాహనాలు తిరిగేందుకు యోగ్యం కాని రోడ్లు 14,884 కిలోమీటర్లు ఉన్నట్లు గుర్తించారు. -
నాణ్యతకు పాతర
పీలేరు నియోజకవర్గంలో నాసిరకంగా సీసీ రోడ్ల నిర్మాణం ఏడాదిలోపే మారిన రూపురేఖలు రూ.122.75 కోట్ల ప్రజాధనం మట్టిపాలు పీలేరు: పీలేరు నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయూంలో నిర్మించిన సీసీ రోడ్లలో నాణ్యతకు పాతర వేశారు. ఫలితంగా ఆ రోడ్లు నిర్మించిన ఏడాదికే రూపురేఖలు కోల్పోయూయి. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పీలేరు నియోజకవర్గంలో ఏడు విడతల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.122.75 కోట్ల నిధులు మంజూరు చేశారు. రెండేళ్ల క్రితం ‘పడా’ ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఏమైందో ఏమో ఆ టెండర్లను రద్దు చేసి నామినేషన్ ప్రాతిపదికన హేబిటేషన్ కమిటీల పేరిట పనులు కేటాయించారు. రూ.122 కోట్లకు పైగా సీసీ రోడ్లు నిర్మించారు. పనులకు నిబంధనలివీ.. రూ.5 లక్షల లోపు నామినేషన్ పనులు చేపట్టడానికి ఐదుగురు సభ్యులతో హేబిటేషన్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఏ ప్రాంతంలో సీసీరోడ్డు నిర్మిస్తామో అక్కడి ప్రజలతో కూడా కమిటీ ఏర్పాటు చేయూలి. అనంతరం పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఆమోదంతో ఆ శాఖ జేఈ, డీఈలు ఆ పని మంజూరు కోసం ఈఈకి ప్రతి పాదనలు పంపాలి. ఈఈ హేబిటేషన్ కమిటీ సిఫార్సు చేసిన ఒక వ్యక్తి పేరిట పనులు చేపట్టడానికి వర్క్ ఆర్డర్ ఇస్తారు. నిబంధనలకు నీళ్లు.. సీసీ రోడ్ల నిర్మాణంలో నిబంధనలకు నీళ్లు వదిలారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. శాఖాపరంగా కాంట్రాక్టర్‌కు 14 శాతం ఆదాయం ఉంటుందని, అయితే నిబంధనల ప్రకారం పనులు చేపట్టకపోవడంతో ఎక్కువగా లబ్ధిపొందారని విమర్శలున్నాయి. అప్పట్లో అధికార పార్టీకి చెందిన ఓ కీలక వ్యక్తి ఆదేశాల మేర కే ఈ మేరకు పనులు జరిగాయన్న ఆరోపణలున్నాయి. కనిపించని ఎం20 కాంక్రీట్.. టెండర్లు లేకుండా జరిగే సీసీ రోడ్లను ఎం20 కాంక్రీట్‌తో నిర్మించాల్సి ఉంది. ఈ నిబంధన మేరకు ఒక క్యూబిక్ మీటర్‌కు 330 కిలోల సిమెంట్, 45 క్యూబిక్ మీటర్ల ఇసుక, 9 క్యూబిక్ మీటర్ల కంకరతో నిర్మాణ పనులు చేపట్టాలి. నిర్మాణం పూర్తయిన 21 రోజులపాటు నీటితో క్యూరింగ్ చేయాలి. పనుల్లో ఎక్కడా ఎం20 కాంక్రీట్ వేయడం లేదనే ఆరోపణలున్నాయి. తూతూమంత్రంగా తనిఖీలు క్వాలిటీ కంట్రోల్ అధికారులు సీసీ రోడ్ల పనులను తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. పనులు పూర్తయిన అనంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో రోడ్డుకు చివరిలో కొలతలు మాత్రమే చూపుతున్నారనే ఆరోపణ లున్నాయి. పీలేరు నియోజకవర్గంలో భారీ స్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నా ఒక డీఈనే పనులను పర్యవేక్షించడంపై ఆరోపణలు గుప్పుమన్నాయి. ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ భూముల్లో సీసీ రోడ్లు వేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నాణ్యత లో రాజీలేదు సీసీ రోడ్ల నిర్మాణంలో భాగంగా నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో ఎక్కడా రాజీపడలేదు. నియోజకవర్గంలో దాదాపు రూ.80 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మించాం. సకాలంలో పనులు ప్రారంభించక రూ.42 కోట్లు వెనక్కిపోయాయి. ఒకటి రెండు చోట్ల నాణ్యత లోపించి ఉంటే తక్షణం పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల మేరకు హేబిటేషన్ కమిటీ ఆధ్వర్యంలోనే పనులన్నీ చేపట్టాం. -రమణయ్య, పీలేరు పంచాయతీరాజ్ డీఈ -
కో‘దడ’
సాక్షిప్రతినిధి, నల్లగొండ :కోదాడ మున్సిపాలిటీలో బహిరంగంగానే వ్యాపారం జరుగుతుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. పట్టణంలోని వివిధ వార్డుల్లో రూ.3.50కోట్ల అంచనావ్య యంతో సీసీ రోడ్లు, కల్వర్టులు, సైడ్‌డ్రెయిన్లు, పైప్‌లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందే, పబ్లిక్ హెల్త్ ఈఈ, మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ (సూర్యాపేట ఆర్డీఓ) అనుమతి మేరకు ఈ ఏడాది జనవరి 27వ తేదీన టెండర్ నోటీసు ఇచ్చారు. ఫిబ్రవరి 11వ తేదీన టెండర్లు జరిగాయి. మే 20వ తేదీన టెండర్లను ఆమోదించి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకుని పనులు అప్పగించారు. అయితే, ఆ సమయంలో ఎన్నికలకోడ్ అమలులో ఉండడంతో పనులు మొదలుపెట్టలేదు. బీఆర్జీఎఫ్, ఎస్ఎఫ్సీ, 13వ ప్రణాళిక సంఘం నిధులతో పూర్తి కావాల్సిన రూ.3.50కోట్ల పనులపై కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్ల కన్ను పడింది. తాజా కథ.. తమ మున్సిపాలిటీలో ఏకంగా రూ 3.50కోట్లతో పనులు జరుగుతున్న విషయాన్ని గమనించిన కౌన్సిలర్లు, పాలకవర్గం కొలువు దీరేదాకా పనులు మొదలు పెట్టొద్దని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి బ్రేక్ వేయించారు. రకరకాల మలుపులు తిరిగిన రాజకీయంతో పాలకవర్గం పగ్గాలు పుచ్చుకున్న కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఈ పనులు తక్షణ ఆదాయవనరుగా కనిపించాయి. తమ వార్డుల్లో చేపట్టే పనుల్లో కచ్చితంగా తమకు పర్సెంటేజీ ఇవ్వాల్సిందేనని కౌన్సిలర్లు అడ్డం పడడం మొదలుపెట్టారు. అంచనా వ్యయంపై 10శాతం కౌన్సిలర్లు, 3శాతం చైర్మన్, 10శాతం ఆఫీసు ఖర్చులు, 1శాతం వైస్‌చైర్మన్‌కు ఇలా.. పర్సెంటేజీలు ముట్టజెప్పాలని గొడవ జరుగుతోందని కోదాడ మున్సిపాలిటీలో జోరుగాప్రచారం జరుగుతోంది. పర్సెంటేజీలు ఇవ్వకుంటే పనులు రద్దు చేసుకుని వెళ్లిపోవాలని, తామే మళ్లీ టెం డర్లు వేసి పనులు చేయించుకుంటామని బెది రింపులకు దిగుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నారు. తమ డిమాండ్లకు తలొగ్గని కాంట్రాక్టర్లు చేపడుతున్న పనుల వద్దకు వెళ్లి, నాణ్యత ప్రమాణాల్లేవు అంటూ నానా హడావిడి చేసి పత్రికలకు ఎక్కుతున్నారని, వాస్తవానికి పనులు పూర్తయ్యాక ‘క్వాలిటీ కంట్రోల్’ చెకింగ్ జరిగి, అప్రూవల్ వస్తేనే ఫైనల్ బిల్లు చెల్లిస్తారని, కానీ, కావాలనే కొందరు కౌన్సిలర్లు నాణ్యత తనిఖీల పేర హడావిడి చేస్తున్నారన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఈ పనులు జనరల్ ఫండ్‌తో చేపట్టినవి కాదు. ఈ పనులపై కౌన్సిలర్లకు ఎలాంటి అజమాయిషీ ఉండదు. ఇక, పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేది లేదని, నయాపైస ఇవ్వడానికి కూడా చెక్‌పవర్ లేని పాలకవర్గ పెద్దలు కొత్తకొత్త కండీషన్లు పెడుతున్నట్లు సమాచారం. ఎన్నికల ఖర్చు రాబట్టుకునే పనిలో.. ‘‘కోదాడ మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా గెలిచేందుకు కనీసం పాతిక లక్షల రూపాయలైనా ఖర్చు పెట్టి ఉంటాం. మా ఖర్చులు మేం రాబట్టుకోవద్దా’’ అన్న తరహాలో కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, కోదాడలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోను మెజారిటీ కాం గ్రెస్‌కు రాలేదు. ఈ మున్సిపాలిటీని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పెద్దలు పెద్ద కసరత్తే చేశారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలోనూ డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు ఉన్నా యి. ఈ ఖర్చులన్నీ రాబట్టుకునేందుకు గృహనిర్మాణ అనుమతులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల వంటి వాటి దాకా ఏదీ తమకు తెలియకుండా పనిచేయొద్దని అధికారులకు పాలకవర్గ పెద్దలు హుకుం జారీ చేశారని చెబుతున్నారు. మరోవైపు ఇటీవల మున్సిపాలిటీల్లో బీఆర్జీఎఫ్ నిధుల కింద ప్రదొవార్డుకు బడ్జెట్ కేటాయించారు. ఈ నిధులతో అన్ని వార్డులకు సమంగా బడ్జెట్ కేటాయించారని, కానీ, కాం గ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మాత్రం తమ వార్డులకు ఎక్కువ నిధులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎక్కువ నిధులతో పనులు చేపడితే, ఎక్కువ పర్సెంటేజీలు వస్తాయన్న కారణంతోనే పేచీ పెడుతున్నారని విపక్ష కౌన్సిలర్లు విమర్శలకు దిగుతున్నారు. ఇదీ.. ఉదాహరణ ! కోదాడ మున్సిపాలిటీలో చేపడుతున్న ఈ పనుల్లో కొన్నింటికి ఓ కాంట్రాక్టర్ 16శాతం తక్కువ కోట్ (లెస్ టెండర్) చేసి దక్కించుకున్నారు. అంటే లక్ష రూపాయల విలువైన పనిని రూ.84వేలకే పూర్తి చేస్తానని ముందుకొచ్చినట్టు లెక్క. ప్రచారం జరుగుతున్న పర్సెంటేజీల ప్రకా రం ఇందులో రూ.24వేలు కూడా తీసివేస్తే, ఇక మిగిలేది రూ.60వేలు. అంచనా వ్యయంపై సీఎస్టీ, జీఎస్టీ, ఈఎండీ వంటి ఖర్చులన్నీ వెళ్లాలి. ఇందులోనే కాంట్రాక్టర్ తన లాభం కూడా చూసుకోవాలి. ఇక, మిగిలే సొమ్మెంత..? ఆ సొమ్ముతో చేపట్టే పనిలో నాణ్యత ఎంత..? -
గ్రామానికో రూ.2కోట్లు.. జిల్లాకు రూ.4,014 కోట్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మా ఊళ్లో వీధులన్నీ సీసీ రోడ్లు చేయాలి. సీసీ డ్రైనేజీలు నిర్మించాలి. రక్షిత మంచినీటిని అందించేందుకు బోరు.. వాటర్ ట్యాంక్ నిర్మించాలి. పైపులైన్లు వేయాలి. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. చెర్వుకు మరమ్మతులు చేయాలి. పూడిక తీయాలి. కాల్వలు పునరుద్ధరించాలి. పాఠశాలలో టాయిలెట్లు, అదనపు గదులు నిర్మించాలి. ప్రహరీ గోడ కట్టాలి. ‘మన ఊరు-మన ప్రణాళిక’ గ్రామసభల్లో జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తిన విన్నపాల్లో ప్రధాన అంశాలివే. వీటిని సమకూర్చేందుకు సగటున ఒక్కో పల్లెలో ఎంత ఖర్చు అవుతుంది... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్షేత్ర స్థాయి ప్రణాళికలను అమలు చేసేందుకు మన జిల్లాకు ఎంత బడ్జెట్టు కావాలి... అనే అంచనాలు రూపు దిద్దుకుంటున్నాయి. వరుసగా గ్రామసభల్లో వచ్చిన విన్నపాలను అధికారులు క్రోడీకరించి అంచనాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సర్కారు సూచించిన మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్య క్రమం లో మూడు ప్రతిపాదనలను ఆన్లైన్లో పొందు పరుచనున్నారు. రమారమి వీటికి ఎంత ఖర్చు అవుతుంది... అని మండల స్థాయిలో అధికారులు అంచనా వ్య యాన్ని నమోదు చేస్తున్నారు. గ్రామ సభల్లో వచ్చిన డిమాండ్ల ప్రకారం ఒక్కో గ్రామానికి సగటున రూ.2 కోట్లు కావాలని అంచనా వేశారు. పెద్ద గ్రామాల్లోని అవసరాలకు దాదాపు రూ.4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని గుర్తించారు. జిల్లాలో మొతం్త 1207 పంచాయతీలున్నాయి. ఈ లెక్కన జిల్లాకు కనీసం రూ.4014 కోట్ల బడ్జెట్టు అవసరమవుతుందని ప్రాథమిక అంచనా. గ్రామ ప్రణాళికలన్నీ క్రోడీకరించిన అనంతరం జిల్లా ప్రణాళిక తయారీ చేస్తారు. దీంతో జిల్లాకు ఎంత బడ్జెట్టు అవసరమవుతుందనేది పక్కాగా లెక్కతేలుతుంది. క్షేత్రస్థాయి అంచనాలు చిన్న గ్రామమైతే కనీసం వెయ్యి మీటర్ల సీసీ రోడ్డు వేయాలి. ఇంజినీరింగ్ అధికారుల అంచనా ప్రకారం ఒక్కో మీటర్‌కు రూ.3000 ఖర్చు అవుతుంది. సీసీ మురికి కాల్వ నిర్మాణానికి ఒక్కో మీటర్‌కు రూ.2000 ఖర్చు. నలభై వేల లీటర్ల సామర్థ్యముండే తాగునీటి పథకానికి రూ.20 లక్షలు, 60 వేల లీటర్ల కెపాసిటీ ట్యాంక్‌కు రూ.27 లక్షలు, పైపులైన్లు, బోర్‌కు రూ.20 లక్షలు అవసరమవుతాయి. పూడికతీత, కట్టకు మరమ్మతులు, జంగిల్ క్లియరెన్స్, తూములు, షట్టర్ల మరమ్మతులు.. మొత్తంగా చెరువు అభివృద్ధికి కనీసం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలు అవసరం. ఇదే తీరుగా ప్రత్యేక విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, కొత్త విద్యుత్ స్తంభాలకు సంబంధించిన అర్జీలు వెల్లువెత్తాయి. మొత్తంగా ఒక్కో పంచాయతీకి సగటున రూ.2 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరమున్నట్లు మండల స్థాయి అధికారులు లెక్క గట్టారు. నేటితో ఆఖరు శుక్రవారం నాటికి జిల్లాలో 1200 గ్రామాల్లో సభలు నిర్వహించారు. హుస్నాబాద్‌లో మిగిలిన అయిదు గ్రామాలు, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలాల్లో మిగిలిన రెండు గ్రామాల్లో శనివారం సభలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సుల్తానాబాద్ మండలంలో ఈ ప్రణాళికల తయారీలో పాలుపంచుకున్నారు. ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం తన నియోజకవర్గంలో జరిగే సభలకు హాజరవనున్నారు. షెడ్యూలు ప్రకారం గ్రామస్థాయి ప్రణాళికలను మరో నాలుగు రోజుల్లో ఆన్లైన్లో నమోదు చేసి.. తదుపరి జిల్లా ప్రణాళికను సిద్ధం చేస్తారు. ప్లాన్ 2005 గ్రామ ప్రణాళికలను మండలంలో.. మండల ప్రణాళికలను జిల్లాలో... జిల్లా ప్రణాళికలను రాష్ట్ర స్థాయిలో ఆమోదించి బడ్జెట్టు రూపకల్పన చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమం తలపెట్టింది. 2005లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలకు సంబంధించి సూక్ష్మ ప్రణాళికలు తయారు చేయించారు. అన్ని మండలాల్లో అధికారులు ఆగమేఘాలపై వీటిని రూపొందించి స్పైరల్ బైండిగ్ చేయించి కట్టలు కట్టారు. కానీ.. అప్పటి ప్రభుత్వం వీటికి తగిన ప్రాధాన్యమివ్వకపోవటంతో అధికారుల స్థాయిలోనే అవి అటకెక్కాయి. దీంతో కేసీఆర్ ప్రయత్నం క్షేత్రస్థాయిలోనే ఆగిపోయింది. ఇప్పుడు నవ తెలంగాణ లక్ష్యంతో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అప్పటి తన ఆలోచనకు మరింత పదునుపెట్టి రాష్ట్రస్థాయికి విస్తరించారు. దీంతో భవిష్యత్తు నిధుల కేటాయింపులో ఈ ప్రణాళికల ప్రాధాన్యం కీలకంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
నిధులు పుష్కలం...పనులే నత్తనడక
యాచారం, న్యూస్‌లైన్ : నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం దళితులు, గిరిజనులకు శాపంగా మారింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు.. అధికారులు, ప్రజాప్రతినిధులను తమదైన రీతిలో మచ్చిక చేసుకొని ఏడు నెలలుగా పనులను నత్తనడకన కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ కాలనీలవాసులు అపరిశుభ్ర వాతావరణంలో మగ్గుతున్నారు. మండలంలోని 20 గ్రామాలకు గతేడాది జూలై నెలలో ఈజీఎస్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు నిర్మించడానికి రూ.కోటి ఐదు లక్షల నిధులు మంజూరయ్యాయి. మాల్, నల్లవెల్లి గ్రామాలకు రూ.పది లక్షల చొప్పున, మిగతా గ్రామాలకు దాదాపు రూ.ఐదు లక్షల చొప్పున నిధులు విడుదలయ్యాయి. వీటితో ఆయా గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని గతేడాది జూలై చివరలోనే మండల పరిషత్ కార్యాలయానికి ఉత్తర్వులు కూడా వచ్చాయి. అయితే కేవలం నానక్‌నగర్, మల్కీజ్‌గూడ, నస్దిక్‌సింగారం, కుర్మిద్ద, గునుగల్, చింతపట్ల గ్రామాల సర్పంచ్‌లు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఆ గ్రామాల్లోనే పనులు పూర్తయ్యాయి. కాని మిగతా 14 గ్రామాల్లో మాత్రం నేటికీ పనులు పూర్తికాలేదు. ఇదిలా ఉంటే.. గత పక్షం రోజులుగా ఎన్నికల కోడ్ వస్తుందనే పుకార్ల నేపథ్యంలో మంజూరైన నిధులు వెనక్కి వెళ్లిపోతాయనే భయంతో సర్పంచ్‌లు ఎంతో అర్భాటంగా ఆయా గ్రామాల్లో పనులు ప్రారంభిస్తున్నట్లు పత్రికల్లో ప్రకటించుకుంటున్నారు. కానీ కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి అభివృద్ధి పనులు చేయించడంలో మాత్రం అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు... అభివృద్ధి పనులు వేగవంతంగా జరగకపోవడం వల్ల ఆయా గ్రామాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లోనే మురుగు నీరు పారడం, దుర్వాసన, దోమలతో తరచు అస్వస్థతకు గురవుతున్నామని పలు కాలనీలవాసులు పేర్కొంటున్నారు. యాచారంలోని వీకర్ సెక్షన్ కాలనీవాసులు రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు వెంటనే నిర్మించాలంటూ పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు చేశారు. అదే విధంగా నక్కర్తమేడిపల్లి, మాల్, నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి తదితర గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీల ప్రజలు డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు. -
నాణ్యత‘గాలి’ లో..!
పునరావాస కాలనీల్లో పనుల్లో నిబంధనలకు తిలోదకాలు పనుల్లో నాణ్యతా లోపం పది రోజులకే పెచ్చులూడుతున్న వైనం ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: వంశధార రిజర్వాయర్ నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీల పనుల్లో నాణ్యత లోపిస్తోంది. లక్షలాది రూపాయల నిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తూ..కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు జేబులు నింపుకుంటున్నారని పలువుఉ విమర్శిస్తున్నారు. తాయిమాంబాపురం వద్ద హిరమండలం మండలం గార్లపాడు గ్రామానికి చెందిన వంశధార రిజర్వాయర్ నిర్వాసితుల కోసం పునరావాస కాలనీని ఏర్పాటు చేశారు. కాలనీకి రెండు వైపులా ఉన్న యంబరాం, బొత్తాడసింగి రోడ్లను సిమెంట్ రోడ్లుగా తీర్చిదిద్దేందుకు 62 లక్షలతో పనులు చేపట్టారు. రెండు ప్యాకేజీలుగా చేపట్టిన ఈ పనుల్లో ఒక ప్యాకేజీలో 28 లక్షలతో 550 మీటర్ల దూరం సీసీ రోడ్డు నిర్మించారు. అలాగే మరో ప్యాకేజీలో మరో ప్యాకేజీలో రూ.34లక్షలతో 600 మీటర్లమేర సీసీ రోడ్డుతోపాటు రక్షణగోడతో కూడిన రెండు కల్వర్టులు నిర్మించారు. సీసీ రోడ్డు ఏర్పాటు, కల్వర్టుల నిర్మాణంలోనూ నాణ్యతకు పాతరేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరైన మెటల్ సైజు ఉపయోగించలేదని, మిక్సింగ్ మెటల్ ఇసుకను తలపిస్తోందని నిర్వాసితులు పేర్కొంటున్నారు. నిబంధనలకు తిలోదకాలి స్తూ..తమ బతుకులతో ఆడుకుంటున్నారని వా పోతున్నారు. కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు కలిసి..నిధులు కాజేశారన్న ఆరోపణలు లేకపోలేదు. ప నుల్లో నాణ్యత లోపించకుండా చర్యలు చేపట్టాల్సిన ఇంజినీరింగ్ అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారు లు స్పందించి నాణ్యత లోపించకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. బిల్లులు చెల్లించలేదు రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేదని పీఆర్ విభాగం ఏఈ కృష్ణమూర్తి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. క్వాలిటీ కంట్రోల్ పరిశీలనలు జరుగుతాయని, నాణ్యతలో లోపా లు బయటపడితే..చర్యలు తప్పవన్నారు. అధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టాలన్నారు. -
కాంట్రాక్ట్ కొట్టేయ్.. రోడ్డు వేసెయ్
మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : మిర్యాలగూడ పట్టణంలో భూగర్భ డ్రెయినేజీ నిర్మా ణం కోసం కాలనీల్లో ఉన్న సీసీ రోడ్లను తవ్వారు. దీంతో వీధులన్నీ గుంతల మయంగా మారాయి. తిరిగి రోడ్లు నిర్మించాల్సి ఉన్నా నిర్మించక పోగా అవసరం లేని చోట నిర్మించారు. అధికార పార్టీ నాయకులే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి ఇష్టానుసారంగా సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. ఇళ్లు లేని చోట రోడ్లు నిర్మించి ఉన్న చోట మాత్రం వదిలేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. సీసీ రోడ్ల కోసం రూ.34.53 కోట్లు మిర్యాలగూడ పట్టణంలో భూగర్భ డ్రెయినేజీ నిర్మా ణం చేపట్టిన 84 కిలో మీటర్ల మేర సీసీరోడ్ల నిర్మాణానికి రూ. 34.53 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయి. దీనికి తోడు మురికి వాడల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.20.95 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో కొందరు అధికార పార్టీ నాయకులు తమ ఇష్టాను సారంగా సీసీ రోడ్లు నిర్మించారు. ఇటీవల పట్టణంలో నాన్ ప్లాన్ నిధులు రూ. 51 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు కూడా అధికార పార్టీ నేతలే తమ ఇష్టాను సారంగా నిర్మిస్తున్నారు. ప్రజలకు అవసరం ఉన్న చోట వదిలేసి తమకు ఇష్టమైన ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నారు. కాలనీల్లో రోడ్లు వేయకుండా తమకు సంబంధించిన ప్లాట్లు ఉన్న ప్రాంతాల్లో కూడా రోడ్లు వేస్తూ వాటి డిమాండ్ పెంచేస్తున్నారు. ముడుపులు ఇచ్చిన వారికి ఇంటి గుమ్మం వరకు కూడా సీసీ రోడ్డు నిర్మించారు. రోడ్ల వెంట మట్టిపోయని కాంట్రాక్టర్లు సీసీ రోడ్లు నిర్మించాక పక్క నుంచి మట్టి పోయాల్సిన కాంట్రాక్టర్లు ఆ విషయాన్ని విస్మరించారు. సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయ్యాక కనీసం క్యూరింగ్ కూడా సక్రమంగా చేయడం లేదు. రోడ్ల పక్కన మట్టిపోయకపోవడంతో ద్విచక్ర వాహనాలు రోడ్డు కిందికి వెళ్లి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గుంతల మయంగా మారిన రోడ్లు మా కాలనీలో భూగర్భ డ్రెయినేజీ నిర్మాణం కోసం గతంలో ఉన్న సీసీ రోడ్లను తవ్వారు. కానీ తిరిగి రోడ్లు నిర్మించడం లేదు. దీంతో మా కాలనీలోని రోడ్డు గుంతల మయంగా మారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంతో మంది కిందపడి గాయాల పాలవుతున్నారు. కాలనీలు లేని చోట కూడా రోడ్లు నిర్మించి మా కాలనీలో మాత్రం సీసీ రోడ్డు నిర్మించడం లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. - అల్లాని సువర్ణ, రెడ్డికాలనీ, మిర్యాలగూడ -
పేదలందరికి పక్కా ఇళ్లు
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే పేదలందరికీ ఇళ్ల స్థలాలతోపాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. సోమవారం స్థానిక మామిళ్లగూడెం ఇందిరమ్మ కాలనీలో హౌసింగ్ బోర్డు నిధులు *1.09 కోట్లతో నిర్మించనున్న సీసీరోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా సీసీ రోడ్లు మం జూరు చేయించామన్నారు. కంచనపల్లి సమీపంలో నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం 150 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు తెలిపారు. ఇళ్లకు కరెంటు బిల్లులు వేలల్లో వస్తున్నాయని కాలనీ మహిళలు తెలపడంతో ఎమ్మెల్యే ట్రాన్స్ కో ఎస్సీతో ఫోన్లో మాట్లాడి బిల్లులను సరిచేయించాలని ఆదేశించారు. టీడీపీ వాళ్లు తెలంగాణ ద్రోహులు తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతున్న సమయంలో తెలంగాణ రాకుండా అడ్డుకుంటున్న టీడీపీ నాయకులు తెలంగాణ ద్రోహులుగా మారారని, మానవత్వం లేని కమ్యూనిస్టులు మూర్ఖులుగా వ్యవహరిస్తున్నారని వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణకు అడ్డుపడుతున్న టీడీపీ, సీపీఎంల నాయకులను గ్రామాలకు రాకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిగూడెంలో 60 ఎకరాల భూమిలో నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించాలని నిర్ణయిస్తే కోర్టుకు వెళ్లి నిర్మాణం కాకుండా సీపీఎం నేతలు అడ్డుకున్నారని తెలిపారు. వెలుగుపల్లి, రసూల్‌పురం, మామిళ్లగూడెం గ్రామాల్లో అర్హులైన పేదల కోసం ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం స్థల సేకరణ చేస్తుంటే సీపీఎం నాయకులు అడ్డుతగులుతున్నారని విమర్శించారు. పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తుంటే అసత్య అరోపణలు చే స్తూ ప్రజలకు మోసం చేస్తున్నారని చెప్పారు. కమ్యూనిస్టుల కుయుక్తులను ప్రజలు గమనించాలని కోరారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శరత్‌బాబు, నన్నూరి విష్ణువర్ధన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వంగూరు లక్ష్మయ్య, నాయకులు గుమ్ముల మోహన్‌రెడ్డి, బాబ, పెరికకిషన్, ఉడుత వెంకన్న, పనస శంకర్‌గౌడ్, దైద వెంకట్‌రెడ్డి, చింతల భిక్షం, మార్త యాదగిరిరెడ్డి, దైద శేఖర్‌రెడ్డి, గడ్డం అనూప్‌రెడ్డి, పెరిక మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల వలయంలో ప్రభు క్యాంప్
కంప్లి, న్యూస్‌లైన్ : స్థానిక ప్రభు క్యాంప్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. గ్రామీణ అభివృద్ధే తమ ధ్యేయమని చెప్పుకున్న ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నెంబర్-10 ముద్దాపురం గ్రామ పరిధిలోని ప్రభు క్యాంప్ గురించి పట్టించుకున్న పాపానపోలేదు. మురికి కాలువలు, మరుగుదొడ్లు, సీసీరోడ్లు లేక ఆ ప్రాంతం ఈగలకు నిలయంగా మారింది. ఆశ్రయ ఇళ్లు లేకపోవడం, విద్యుత్ సమస్యలతో క్యాంపు వాసులు సతమతమవుతున్నారు. మరుగుదొడ్లు లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిరుపేదలకు ‘ఆశ్రయం’ లభించక నేటికీ పూరి గుడిసెల్లోనే జీవ నం సాగిస్తున్నారు. గ్రామ పంచాయతీ పరంగా మంజూరు చేస్తున్న ఆశ్రయ గృహాలు ఎటు వెళ్లి పోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవలే నిర్మించిన మురికి కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. సంవత్సరం క్రితం నిర్మించిన నీళ్ల ట్యాంక్ నిర్వహణ కరువై పాచిపట్టి పోయింది. గ్రామ పంచాయతీ సభ్యురాలే అంగన్వాడీ సహాయకురాలుగా ఉన్నప్పటికీ స్వచ్ఛత కాపాడటంలో విఫలమయ్యారని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు విడుదల చేస్తున్న రూ. లక్షల నిధులు ఎటు వెళ్లి పోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో తమ ఇళ్ల చుట్టూ తిరిగి ఓటు వేయించుకున్న నేతలు తమ క్యాంప్ అభివృద్ధిపై నిర్లక్ష్యం చూపుతున్నారని క్యాంప్ వాసులు వన్నూర్‌స్వామి, ఇంద్రారెడ్డి, నరసమ్మ, విజయలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు