కాంట్రాక్టర్, నాయకులతో వాగ్వాదానికి దిగిన నాగరాజు
జైపూర్(చెన్నూర్) : అవసరం లేని చోట సీసీ రోడ్లు నిర్మిస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, ప్ర జలకు ఉపయోగడే విధంగా వీధుల్లో సీసీ రోడ్లు ని ర్మించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని నర్వ గ్రామానికి చెందిన దూట నాగరాజు సోమవారం ఉదయం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు సమీప ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా సీఎస్‌ఆర్ నిధులు రూ.73లక్షల ద్వారా నర్వ గ్రామంలో అంతర్గ త రోడ్లు నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్లు నిర్మించి ఉన్నప్పటికీ నిధులు మంజూరు చేశారని, మరి కొ న్ని చోట్ల అవసరం లేకున్నా రోడ్లు మంజూరు అ య్యాయని, ప్రజలకు ఉపయోగడే విధంగా వీ ధుల్లో సీసీ రోడ్డు నిర్మించాలని అధికారులను, కాం ట్రాక్టర్‌ను కోరాడు.
ఈ క్రమంలో కాంట్రాక్టర్‌కు నాగరాజుకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాంట్రాక్టర్ బెదిరింపులకు పాల్పడ్డారని మనస్తా పం చెందిన నాగరాజు పెట్రోల్ పోసుకోగా, స్థానికులు అప్రమత్తమై అడ్డుకున్నారు. అతడిని 108లో మంచిర్యాల ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment