నాణ్యత‘గాలి’ లో..! | no quality and maintainance | Sakshi
Sakshi News home page

నాణ్యత‘గాలి’ లో..!

Published Fri, Feb 21 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

no quality and maintainance

పునరావాస కాలనీల్లో పనుల్లో
    నిబంధనలకు తిలోదకాలు
  పనుల్లో నాణ్యతా లోపం
  పది రోజులకే
    పెచ్చులూడుతున్న వైనం
 ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్:  వంశధార రిజర్వాయర్  నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీల పనుల్లో నాణ్యత లోపిస్తోంది. లక్షలాది రూపాయల నిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తూ..కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు జేబులు నింపుకుంటున్నారని పలువుఉ విమర్శిస్తున్నారు.
 
 తాయిమాంబాపురం వద్ద హిరమండలం మండలం గార్లపాడు గ్రామానికి చెందిన వంశధార రిజర్వాయర్  నిర్వాసితుల కోసం పునరావాస కాలనీని ఏర్పాటు చేశారు. కాలనీకి రెండు వైపులా ఉన్న యంబరాం, బొత్తాడసింగి రోడ్లను సిమెంట్ రోడ్లుగా తీర్చిదిద్దేందుకు 62 లక్షలతో పనులు చేపట్టారు. రెండు ప్యాకేజీలుగా చేపట్టిన  ఈ పనుల్లో ఒక ప్యాకేజీలో 28 లక్షలతో 550 మీటర్ల దూరం సీసీ రోడ్డు నిర్మించారు.  అలాగే మరో ప్యాకేజీలో మరో ప్యాకేజీలో రూ.34లక్షలతో 600 మీటర్లమేర  సీసీ రోడ్డుతోపాటు రక్షణగోడతో కూడిన రెండు కల్వర్టులు నిర్మించారు. సీసీ రోడ్డు ఏర్పాటు, కల్వర్టుల నిర్మాణంలోనూ నాణ్యతకు పాతరేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరైన మెటల్ సైజు ఉపయోగించలేదని, మిక్సింగ్ మెటల్ ఇసుకను తలపిస్తోందని నిర్వాసితులు పేర్కొంటున్నారు.  నిబంధనలకు తిలోదకాలి స్తూ..తమ బతుకులతో ఆడుకుంటున్నారని వా పోతున్నారు. కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు కలిసి..నిధులు కాజేశారన్న ఆరోపణలు లేకపోలేదు. ప నుల్లో నాణ్యత లోపించకుండా చర్యలు చేపట్టాల్సిన ఇంజినీరింగ్ అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి  చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారు లు స్పందించి నాణ్యత లోపించకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
 
 బిల్లులు చెల్లించలేదు
 రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేదని పీఆర్ విభాగం ఏఈ కృష్ణమూర్తి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. క్వాలిటీ కంట్రోల్ పరిశీలనలు జరుగుతాయని, నాణ్యతలో లోపా లు బయటపడితే..చర్యలు తప్పవన్నారు. అధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టాలన్నారు.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement