
సాక్షి, శ్రీకాకుళం : ఒడిషా రాష్ట్రంలోని వంశధార నది పరివాహక ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదికి వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గొట్టా బ్యారేజీలో ప్రస్తుత నీటి మట్టం 7500 క్యూసెక్కులు ఉండగా, రేపు ఉదయానికి నదిలో సుమారు 25 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం వుందని ఒడిషా అధికారులు హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని 13 మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని జిల్లా ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. వరద ముప్పు నేపథ్యంలో గొట్టా బ్యారేజీలోని నీటిని 22 గేట్లు ఎత్తి వేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.