స్థానిక ప్రభు క్యాంప్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. గ్రామీణ అభివృద్ధే తమ ధ్యేయమని చెప్పుకున్న ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నెంబర్-10 ముద్దాపురం గ్రామ పరిధిలోని ప్రభు క్యాంప్ గురించి పట్టించుకున్న పాపానపోలేదు. మురికి కాలువలు, మరుగుదొడ్లు, సీసీరోడ్లు లేక ఆ ప్రాంతం ఈగలకు నిలయంగా మారింది
కంప్లి, న్యూస్‌లైన్ : స్థానిక ప్రభు క్యాంప్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. గ్రామీణ అభివృద్ధే తమ ధ్యేయమని చెప్పుకున్న ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నెంబర్-10 ముద్దాపురం గ్రామ పరిధిలోని ప్రభు క్యాంప్ గురించి పట్టించుకున్న పాపానపోలేదు. మురికి కాలువలు, మరుగుదొడ్లు, సీసీరోడ్లు లేక ఆ ప్రాంతం ఈగలకు నిలయంగా మారింది. ఆశ్రయ ఇళ్లు లేకపోవడం, విద్యుత్ సమస్యలతో క్యాంపు వాసులు సతమతమవుతున్నారు. మరుగుదొడ్లు లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిరుపేదలకు ‘ఆశ్రయం’ లభించక నేటికీ పూరి గుడిసెల్లోనే జీవ నం సాగిస్తున్నారు.
గ్రామ పంచాయతీ పరంగా మంజూరు చేస్తున్న ఆశ్రయ గృహాలు ఎటు వెళ్లి పోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవలే నిర్మించిన మురికి కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. సంవత్సరం క్రితం నిర్మించిన నీళ్ల ట్యాంక్ నిర్వహణ కరువై పాచిపట్టి పోయింది. గ్రామ పంచాయతీ సభ్యురాలే అంగన్‌వాడీ సహాయకురాలుగా ఉన్నప్పటికీ స్వచ్ఛత కాపాడటంలో విఫలమయ్యారని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు విడుదల చేస్తున్న రూ. లక్షల నిధులు ఎటు వెళ్లి పోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో తమ ఇళ్ల చుట్టూ తిరిగి ఓటు వేయించుకున్న నేతలు తమ క్యాంప్ అభివృద్ధిపై నిర్లక్ష్యం చూపుతున్నారని క్యాంప్ వాసులు వన్నూర్‌స్వామి, ఇంద్రారెడ్డి, నరసమ్మ, విజయలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు