
శాంతినగర్‌లో గన్నేరు చెట్లు
వేములవాడఅర్బన్ : వేములవాడ అర్బన్ మండలంలోని నాంపల్లిలోని శాంతినగర్ కాలనీలో 2017లో హరితహారం కార్యక్రమంలో కాలనీవాసులు కాలనీలోని సీసీ రోడ్డుకు ఇరువైపుల గన్నేరు మొక్కలను నాటుకున్నారు. ఎండాకాలంలో కూడా వాటిని ఎవరి ఇంటి ఎదుట వారు నీరు పెట్టుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆ చెట్లు పెరిగి ఇప్పుడు ఆ కాలనీలో గన్నేరు పూలతో, పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కాలనీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ చెట్లను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment