వాటర్ క్యూరింగ్ కోసం రోడ్డుపై గోనె సంచులు కప్పుతున్న కూలీలు
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లాలో మినీ మేడారంగా పిలిచే అగ్రంపహాడ్ జాతర పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. జాతరలో ప్రతి ఏడాది 10లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా సీసీ రోడ్డు వేస్తున్నారు. అటు నిర్మిస్తున్నారో లేదో.. ఇటు రోడ్డుకు పగుళ్లు ప్రారంభమయ్యాయి. అక్కంపేట నుంచి దుర్గంపేట వరకు 6.2 కిలో మీటర్లు ఉంటుంది. గతంలో అగ్రంపహాడ్ నుంచి సమ్మక్క–సారలమ్మ గద్దెల వరకు సింగిల్ రోడ్డు ఉండేది.
దీంతో జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురయ్యేవారు. డబుల్ రోడ్డు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రూ.9కోట్లు కేటాయించింది. రోడ్డు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జాతర సమీపిస్తున్నా పనులు పూర్తి కాలేదు. సీసీ రోడ్డు పోసిన తరువాత మట్టితో కట్టలు కట్టి నీటి ద్వారా క్యూరింగ్ చేయాల్సిం ఉంటుంది. మట్టి కట్టలకు బదులు గోనెతట్లు వేసి నీటిని చల్లుతున్నారు. దీంతో క్యూరింగ్ సక్రమంగా కాకపోవడంతో అప్పుడే పగుళ్లు ఏర్పడుతున్నాయి. పనులను పర్యవేక్షించాల్సిన రోడ్లు భవనాల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రా క్టర్ ఇష్టారాజ్యంగా నాణ్యత లేకుండా పనులు చేపడుతున్నట్లు పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి పనులను పర్యవేక్షించి నాణ్యతగా చేపట్టేలా చూడాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment