
మనమిద్దరం కొత్తపార్టీ పెడదామా?
తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఆవిర్భావించబోతోందా? కొత్త పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే 40 సీట్లు సాధిస్తుందా?
హైదరాబాద్ : తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఆవిర్భావించబోతోందా? కొత్త పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే 40 సీట్లు సాధిస్తుందా? అవునంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసెంబ్లీ ప్రాంగణంలో ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తమ తమ పార్టీల్లో సరైన గుర్తింపు దొరకడం లేదని ఇద్దరూ ఆవేదన చెందారు.
ఈ క్రమంలో తెలంగాణ రెడ్డి సమితి పేరుతో పార్టీ పెడితే ఎలా ఉంటుందని ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఈ పార్టీకి ప్రెసిడెంట్‌గా ప్రొఫెసర్ కోదండరామ్ అయితే బాగుంటుందని ఇద్దరు ఎమ్మెల్యేలు తీర్మానింటారు. టీడీపీలో గట్టి నోరున్న నేత అయినప్పటికీ ఎర్రబెల్లి దయాకర్ రావు కారణంగా తగిన గుర్తింపు లభించడం లేదని రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు.