సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న రేవంత్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతామని, తమ మేనిఫెస్టోలో కూడా పెడతామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
‘‘చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపాడు. వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా 24 గంటలు ఇస్తానని ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పట్లో చంద్రబాబు రైతులను కాల్చి చంపారు. రైతులకు అండగా నిలిచి వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇచ్చారు’’ అని కోమటిరెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికావు. సీతక్కను సీఎం చేస్తానన్న వ్యాఖ్యలు కూడా సరికావు. రేవంత్‌రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఏవీ ఫైనల్ కావు. పీసీసీ అధ్యక్షుడి పదవి చాలా చిన్న పోస్ట్. ఉచిత విద్యుత్‌పై నిర్ణయం తీసుకునే అధికారం రేవంత్‌కు లేదన్న కోమటిరెడ్డి.. ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలి’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
చదవండి: రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దు.. 3 గంటలు ఇస్తే చాలు: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
‘‘రేవంత్ వ్యాఖ్యలపై సీఎల్పీ నేతతో చర్చించాను. అవసరమైతే అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తాం. అమెరికా వెళ్లిన రెండురోజుల్లో రేవంత్ ఎందుకింత గందరగోళంగా మాట్లాడుతున్నారు. రేవంత్‌రెడ్డిపై బాలకృష్ణ ప్రభావం పడిందా?’’ అంటూ కోమటిరెడ్డి వ్యంగంగా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment