
నల్లగొండ: రాష్ట్రపతి ఎన్నికతోనే కేసీఆర్ బండారం బయట పడుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర పతి ఎన్నికలో బీజేపీని ఓడగొట్టాలంటే విపక్షా లతో కలిసి రావాల్సిందేనని, ఆయనకున్న 9 మంది ఎంపీలు, 105 మంది ఎమ్మెల్యేలతో ఏవిధంగా ఓడగొడతారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి శనివారం నల్లగొండలో విలేకరు లతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి లబ్ధిపొందేందుకు బీజేపీతో కొట్లాట పెట్టుకున్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి ఓట్ల శాతం పెంచేందుకే కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడ ఇదని చెప్పారు.
కేసీఆర్ చేతగాని తనం వల్లే గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారని, గవర్నర్ నుంచి వచ్చిన పిటిషన్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజుకో చోట మహిళ లు, బాలికలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతుండటం బాధ కలిగిస్తోంద న్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో తొమ్మిదివ నిందితుడిగా ఉన్న హోం మంత్రి మనవడిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయ లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. దేశంలోనే ఉత్తమ డీజీపీగా అవార్డు అందుకున్న మహేందర్‌రెడ్డి ఇలాంటి చేతగాని సీఎం దగ్గర పనిచేసే బదులు రాజీనామా చేసి వైదొలగాలని హితవు పలికారు. సమావేశంలో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నల్లగొండ జెడ్పీటీసీ లక్ష్మయ్య, నాయకుడు సైదులుగౌడ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment