మాట్లాడుతున్న టీపీసీసీ అధికార ప్రతినిధి రవి
మునుగోడు : కోమటిరెడ్డి బ్రదర్స్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే శాసనసభా సభ్యత్వాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందని టీపీసీసీ అధికార ప్రతినిధి నారబోయిన రవి విమర్శించారు. శనివారం మునుగోడులో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అసమర్థ పాలన గూర్చి ప్రజలకు వివరిస్తున్నారనే కాంగ్రెస్ పార్టీ నాయకులపై ప్రభుత్వం కక్ష పెంచుకుందన్నారు. వారికి ప్రభుత్వ పరంగా ఇచ్చిన గన్‌మెన్లని తొలగించడం సిగ్గు చేటన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు ఎన్ని ఎత్తులువేసినా 2019లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ నెల 9న కోర్టు ఇచ్చే తీర్పులో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అనుకూలంగా వస్తుందని, అందుకు సీఎం కేసీఆర్ తలవంచక తప్పదన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వేమిరెడ్డి జితెందర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు జంగిలి నాగరాజు, బీసం విజయ్, అబ్బరబోయిన బాలక్రిష్ణ, ఆరేళ్ల సైదులు, నారబోయిన శరత్, దొటి మహేష్ యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment