
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం
రాష్ట్ర విభజనకు సంబంధించి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.
నల్గొండ: రాష్ట్ర విభజనకు సంబంధించి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. అవినీతి ఫైళ్లపై సీఎం కిరణ్ సంతకాలు రోజురోజూకు పెరిగిపోతున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. అవినీతి పరుడైన సీఎంను జైలుకు పంపి తీరుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దగ్గరపడుతున్న కొద్దీ..సీఎం అవినీతి ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.సీఎంతో సహా సీమాంధ్రలో ఉన్న మరికొందరు నేతలు కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని కోమటిరెడ్డి తెలిపారు.