కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో యాత్ర’ లోగో విడుదల | Congress Launches Logo Website Of Bharat Jodo Yatra | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో యాత్ర’ లోగో విడుదల

Published Wed, Aug 24 2022 7:19 AM | Last Updated on Wed, Aug 24 2022 7:19 AM

Congress Launches Logo Website Of Bharat Jodo Yatra - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వచ్చే నెల 7వ తేదీ నుంచి భారత్‌ జోడో యాత్ర చేపట్టనుంది కాంగ్రెస్‌ పార్టీ. ఈ క్రమంలో భారత్‌ జోడో యాత్ర లోగో, వెబ్‌సైట్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, యాత్ర నిర్వాహక కమిటీ దిగ్విజయ్‌ సింగ్‌ మీడియా సమావేశంలో ‘కలిసి నడుద్దాం..దేశాన్ని కలిపి ఉంచుదాం(మిలే కదమ్‌.. జుడే వతన్‌)’అనే నినాదంతో కూడిన జోడో యాత్ర నాలుగు పేజీల కరపత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా భారత్‌ జోడో యాత్ర వెబ్‌సైట్‌ను ప్రారంభించారు కాంగ్రెస్‌ నేతలు. యాత్రలో పాల్గొనదలిచిన వారు వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. కన్యాకుమారి నుంచి రాహుల్‌ గాంధీ పాల్గొనే ప్రధాన యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుని 5 నెలలపాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగి కశ్మీర్‌లో ముగియనుందన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రపతిని కలిసిన సోనియా గాంధీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement