మనీష్‌ పెద్ద పెద్ద డైలాగ్స్‌ చెప్పాడు | Prashnistha Movie First Look Launch | Sakshi
Sakshi News home page

మనీష్‌ పెద్ద పెద్ద డైలాగ్స్‌ చెప్పాడు

Published Tue, Feb 5 2019 3:14 AM | Last Updated on Tue, Feb 5 2019 7:23 AM

Prashnistha Movie First Look Launch - Sakshi

మనీష్, హసీనా, బెల్లంకొండ సురేశ్, రాజా వన్నెంరెడ్డి, సి. కల్యాణ్, సత్యారెడ్డి, కిరణ్‌కుమార్‌

నటుడు, నిర్మాత, దర్శకుడు పి.సత్యారెడ్డి తనయుడు మనీష్‌ బాబు హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ప్రశ్నిస్తా’. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో జనం ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై పి.సత్యారెడ్డి నిర్మించిన ఈ చిత్రం లోగోని హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ మాట్లాడుతూ– ‘‘నా  ఆప్తమిత్రుడు సత్యారెడ్డి తనయుడు మనీష్‌ హీరోగా చేసిన  ఈ సినిమా మంచి హిట్‌ కావాలి. మనీష్‌ హీరోగా సక్సెస్‌ అయి మంచి పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నా’’ అన్నారు.

‘‘నేను చెప్పిన మాటని ఆచరణలో పెడుతూ మనీష్‌ని హీరోని చేశారు సత్యారెడ్డి’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్‌. ‘‘సమాజంలో జరుగుతున్న అన్యా యం, అక్రమాలు, ప్రభుత్వ పాలసీలపై ఒక స్టూడెంట్‌ లీడర్‌ ఏ విధంగా పోరాడాడు? ఎలా ప్రశ్నించాడు? అనేది కథ’’ అని పి.సత్యారెడ్డి అన్నారు. ‘‘ఇండస్ట్రీలో గ్రాస్పింగ్‌ పవర్‌ ఉన్న హీరోల్లో కృష్ణగారి పేరు చెప్తారు. ఆయనలా ఈ చిత్రంలో మనీష్‌ పెద్ద పెద్ద డైలాగ్స్‌ చెప్పాడు’’ అని రాజా వన్నెంరెడ్డి అన్నారు. నిర్మాతలు టి.ప్రసన్నకుమార్, దాసరి కిరణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మాటల రచయిత రాజేంద్ర కుమార్, సంగీత దర్శకుడు వెంగి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement