Manish Babu
-
పాటలతో ప్రశ్నిస్తా
మనీష్ బాబు హీరోగా, అక్షిత, హసీనా మస్తాన్ మీర్జా హీరోయిన్స్‌గా రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రశ్నిస్తా’. జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి.సత్యారెడ్డి నిర్మించారు. వెంగి సంగీతం అందించిన ఈ సినిమా పాటల సీడీలను దర్శకుడు కెఎస్ రవీంద్ర(బాబీ) విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రారంభం రోజున మనీష్‌ని చూసాను. మంచి హైట్, ఫిజిక్‌తో బాగున్నాడు. ఇప్పుడు టీజర్ చూసాక హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు తనలో ఉన్నాయి. భవిష్యత్తులో తను పెద్ద హీరోగా ఎదగాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ చిత్రాలు డీల్ చేయడం చాలా కష్టం. కానీ, రాజా వన్నెంరెడ్డిగారు అలాంటి చిత్రాలు తీసి హిట్స్ కొట్టారు’’ అన్నారు.‘‘చిన్న సినిమాగా స్టార్ట్ చేసిన ఈ చిత్రం కథ డిమాండ్‌ను బట్టి బడ్జెట్ ఐదు రెట్లు పెరిగి పెద్ద చిత్రంలా తయారయ్యింది. ఈ సినిమాతో మనీష్ 10కోట్ల రేంజ్ హీరో అవుతాడు’’ అన్నారు రాజా వన్నెంరెడ్డి. ‘‘కమర్షియల్ ఎలిమెంట్స్‌తో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా పొలిటికల్ టచ్‌తో రూపొందించిన చిత్రమిది. ట్రయిలర్ రిలీజ్ చేసిన తర్వాత మా సినిమాకి బిజినెస్ క్రేజ్ పెరిగింది’’ అని పి. సత్యారెడ్డి అన్నారు. మనీష్, అక్షిత, హసీనా మస్తాన్ మీర్జా నిర్మాతలు కోనేరు సత్యనారాయణ, బెక్కం వేణుగోపాల్, రాజీవ్ శివారెడ్డి, వరప్రసాద్, విసు, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నించేందుకు రెడీ
పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించారు నటుడు పి.సత్యారెడ్డి. ఇప్పుడు తన కుమారుడు మనీష్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘ప్రశ్నిస్తా’. అక్షిత కథానాయికగా నటించారు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ వారంలో సెన్సార్ పూర్తి చేసుకుని, వచ్చే వారం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రభుత్వ విధానాలపై ఓ విద్యార్థి నాయకుడు ఏ విధంగా పోరాడాడు.. ఎలా ప్రశ్నించాడు? అన్నది ఈ చిత్రకథ. వినోదంతో పాటు సమాజానికి మంచి సందేశం ఉంటుంది. మనీష్‌కి ఇది తొలి సినిమా అయినా అనుభవం ఉన్నవాడిలా నటించాడు’’ అన్నారు. రావు రమేశ్, ఆమని, హసీన్, షిప్రా కౌర్, వేణుగోపాల్, ప్రభాస్ శ్రీను, అనంత్, శివపార్వతి, ముంతాజ్, ‘ఆర్ఎక్స్ 100’ లక్ష్మణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వెంగి, కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి. -
మనీష్ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పాడు
నటుడు, నిర్మాత, దర్శకుడు పి.సత్యారెడ్డి తనయుడు మనీష్ బాబు హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ప్రశ్నిస్తా’. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి.సత్యారెడ్డి నిర్మించిన ఈ చిత్రం లోగోని హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ– ‘‘నా ఆప్తమిత్రుడు సత్యారెడ్డి తనయుడు మనీష్ హీరోగా చేసిన ఈ సినిమా మంచి హిట్ కావాలి. మనీష్ హీరోగా సక్సెస్ అయి మంచి పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘నేను చెప్పిన మాటని ఆచరణలో పెడుతూ మనీష్‌ని హీరోని చేశారు సత్యారెడ్డి’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘‘సమాజంలో జరుగుతున్న అన్యా యం, అక్రమాలు, ప్రభుత్వ పాలసీలపై ఒక స్టూడెంట్ లీడర్ ఏ విధంగా పోరాడాడు? ఎలా ప్రశ్నించాడు? అనేది కథ’’ అని పి.సత్యారెడ్డి అన్నారు. ‘‘ఇండస్ట్రీలో గ్రాస్పింగ్ పవర్ ఉన్న హీరోల్లో కృష్ణగారి పేరు చెప్తారు. ఆయనలా ఈ చిత్రంలో మనీష్ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పాడు’’ అని రాజా వన్నెంరెడ్డి అన్నారు. నిర్మాతలు టి.ప్రసన్నకుమార్, దాసరి కిరణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మాటల రచయిత రాజేంద్ర కుమార్, సంగీత దర్శకుడు వెంగి తదితరులు పాల్గొన్నారు. -
నవరసాలతో ప్రశ్నిస్తా
‘క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, టామి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు నవ్వులు పంచిన దర్శకుడు రాజా వన్నెంరెడ్డి. మనీష్‌బాబుని హీరోగా పరిచయం చేస్తూ తాజాగా ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ప్రశ్నిస్తా’. అక్షిత కథానాయిక. బి.శేషుబాబు సమర్పణలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి.సత్యారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది. నిర్మాత కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు బాబీ (కె.ఎస్.రవీంద్ర) క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి దర్శకుడు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సత్యారెడ్డి మాట్లాడుతూ– ‘‘మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలని ఇరవై ఏళ్ల కిందట నా స్నేహితుడు రాజా వన్నెంరెడ్డిని కోరా. అది నా బాధ్యత అని చెప్పిన ఆయన ఈరోజు హీరోగా పరిచయం చేస్తున్నారు’’ అన్నారు. రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీ ఎప్పుడూ సక్సెస్ వెనకాలే ఉంటుంది. నా ‘క్షేమంగావెళ్ళి లాభంగారండి’ సినిమా విడుదలైన తర్వాత ఉదయం ఆరుగంటలకే ఎందరి నుంచో ఫోన్లు వచ్చేవి. సక్సెస్ లేనప్పుడు పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. నవరసాలతో కూడిన చిత్రమిది. మా గురువు దాసరిగారితో ఓ సినిమా తీద్దామనుకున్నా. ఆయన దేవుని వద్దకు వెళ్లిపోయారు. ఆయన ఎక్కడున్నా నాకు ఆశీర్వాదాలు ఉంటాయి’’ అన్నారు. మనీష్‌బాబు, అక్షిత, సంగీత దర్శకుడు ప్రేమ్, రచయిత రాజేంద్రకుమార్, బి.వి.రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యోగిరెడ్డి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సతీష్ రెడ్డి, సహ నిర్మాతలు: కె.నారాయణ రెడ్డి, శంకర్ రెడ్డి. -
ప్రతిక్షణం థ్రిల్ చేస్తుంది
‘‘ప్రతిక్షణం’ టైటిల్ చాలా బాగుంది. ‘క్షణం’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ‘ప్రతిక్షణం’ అంతకన్నా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని నిర్మాత రాజ్‌కందుకూరి అన్నారు. మనీష్‌బాబు, తేజస్విని జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతిక్షణం’. నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో జి. మల్లిఖార్జునరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ–రిలీజ్, ప్లాటినమ్ డిస్క్ వేడుకలను నిర్వహించారు. చిత్రనిర్మాత మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ –‘‘ఇందులోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసి, కొత్త అనుభూతినిస్తుంది. రఘురామ్ సంగీతానికి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ సంస్థ డైరెక్టర్ అమృతరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ దేవారెడ్డి, ఓంనాథ్‌రెడ్డి, రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.