ప్రతిక్షణం థ్రిల్‌ చేస్తుంది | Prathikshanam film is released on 18th of this month | Sakshi
Sakshi News home page

ప్రతిక్షణం థ్రిల్‌ చేస్తుంది

Published Thu, Aug 10 2017 12:28 AM | Last Updated on Sun, Sep 17 2017 5:21 PM

ప్రతిక్షణం థ్రిల్‌ చేస్తుంది

ప్రతిక్షణం థ్రిల్‌ చేస్తుంది

‘‘ప్రతిక్షణం’ టైటిల్‌ చాలా బాగుంది. ‘క్షణం’ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో ‘ప్రతిక్షణం’ అంతకన్నా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నా’’ అని నిర్మాత రాజ్‌కందుకూరి అన్నారు. మనీష్‌బాబు, తేజస్విని జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతిక్షణం’. నాగేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో జి. మల్లిఖార్జునరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ప్రీ–రిలీజ్, ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుకలను నిర్వహించారు. చిత్రనిర్మాత మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ –‘‘ఇందులోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసి, కొత్త అనుభూతినిస్తుంది. రఘురామ్‌ సంగీతానికి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ సంస్థ డైరెక్టర్‌ అమృతరావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌ దేవారెడ్డి, ఓంనాథ్‌రెడ్డి, రఘురామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement