తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అమర్‌దీప్ చౌదరి మెగాస్టార్ లెక్క.. సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైన అమర్ ఆ గుర్తింపుతో బిగ్‌బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇవ్వడం. ఆపై రన్నర్‌గా నిలిచాడు. ఇక సీరియల్ నటి, కన్నడ బ్యూటీ అయిన తేజస్వని గౌడను ఆమర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలా ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
బిగ్ బాస్ తర్వాత అమర్ జీవితమే మారిపోయిందని చెప్పవచ్చు. పలు సినిమా ఛాన్స్‌లతో పాటు సీరియల్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే సురేఖా వాణి కూతురు సుప్రితతో అమర్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా తన అభిమాన హీరో రవితేజతో కూడా సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు.
అయితే, అమర్ దీప్, తేజస్విని తాజాగా కొత్త కారు కొన్నారు. బ్లాక్ కలర్‌లో ఉన్న టాటా సఫారి కారును వారు కొన్నారు. దీని ధర రూ. 25 లక్షలకు పైగానే ఉండవచ్చని తెలుస్తోంది. కారు ముందు తేజస్విని తన స్నేహితులతో సందడి చేసింది. అమర్‌తో కలిసి వారందరు దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment