నేను మోసపోయానంటూ రైతుబిడ్డ ఫైర్.. కప్పు ఇచ్చేయండన్న అమర్! | Bigg Boss Season 7 Latest Promo Released Today | Sakshi
Sakshi News home page

Bigg Boss: 'అందరినీ మోసం చేసే గుణం నీది'.. శోభాశెట్టికి ప్రశాంత్‌ గట్టి కౌంటర్!

Published Mon, Dec 4 2023 6:12 PM | Last Updated on Mon, Dec 4 2023 6:59 PM

Bigg Boss Season 7 Latest Promo Released Today - Sakshi

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో చివరిదశకు చేరుకుంది. మరో వారంలో గ్రాండ్ ఫినాలేకు తెరలేవనుంది. గతవారం గౌతమ్ ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో ఇంకా ఏడుగురు ఉన్నారు. వారిలో ఇప్పటికే అర్జున్ గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించాడు. ఇక మరోవారం మొదలైందంటే నామినేషన్స్ ప్రక్రియ షురూ అయింది. హౌస్‌లో ఒకరిపై ఒకరు కారణాలు చెబుతూ నామినేట్ చేసే సమయంలో జరిగే తంతు మామూలుగా ఉండదు. అసలే ఈ వారం నుంచి టగ్ ఆఫ్‌ వార్ అన్న రీతిలో నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. 

బిగ్‌బాస్ సీజన్‌-7 ఇవాల్టి ఎపిసోడ్‌ల నామినేషన్స్ ప్రక్రియలో విమర్శలు వేరే లెవల్‌కు చేరుకున్నాయి. తాజాగా రిలీజైన ప్రోమోలో ప్రశాంత్‌ను అమర్‌దీప్‌ నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడించింది. నువ్వు నన్ను రా అనొద్దంటూ వాదించగా.. నా తమ్ముడిని రా అనే అంటానురా.. పలికితే పలుకు.. లేదంటే పో అంటూ రెచ్చిపోయాడు. ఆ తర్వాత అర్జున్.. అమర్‌, యావర్‌ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత హౌస్‌లో సేఫ్ ప్లేయర్ ఎవరంటే.. ఒక్క పల్లవి ప్రశాంతే అంటూ శోభా శెట్టి నామినేట్ చేసింది. ఆ తర్వాత శివాజీ, ప్రియాంకల చిన్నపాటి వార్ నడిచింది. ఫ్రెండ్‌షిప్ విషయాకొనిస్తే త్యాగం చేసే వాళ్లు కావాలని శివాజీ అనగా.. ప్రియాంక ఏదో అనడంతో.. నువ్వు ఓవర్ స్మార్ట్ ఇక్కడ చేయొద్దమ్మ అంటూ చురకలంటించాడు. దీనికి ఐయామ్ నాట్ ఓవర్ స్మార్ట్ అంటూ ప్రియాంక సమాధానమిచ్చింది.

ఆ తర్వాత ప్రశాంత్, అమర్ మధ్యే పెద్ద వార్ నడిచింది. అమర్ అన్న ఫస్ట్ నుంచి నా మీద నెగెటివ్‌గానే ఉన్నాడు అనడంతో మధ్యలో శోభా ఎంటరైంది. మాట అంటే మాటే.. తగ్గేదేలే.. ప్రాణమైనా ఇస్తాడు అని లోపలికి వెళ్లి దాచి కూర్చోలే అని శోభా అనడంతో.. ఇది నిజ స్వరూపం.. అందరినీ మోసం చేసే గుణం నీది అంటూ ప్రశాంత్ రెచ్చిపోయాడు. దీంతో టాపిక్ డైవర్ట్ చేసి తవ్వుకోద్దంటూ అని అమర్ అన్నాడు. దీనికి ప్రశాంత్ బరాబర్ తవ్వుతా.. తగ్గదేలే అన్నాడు. దీంతో  ఆగరా.. నువ్వు..నీ అబద్ధాలు అంటూ అమర్ ఫైరయ్యాడు. ఎదుటివాళ్లను మోసం చేసుడు నీగుణం.. మోసపోయింది నువ్వు కాదు.. నేను అంటూ ప్రశాంత్ మరింత రెచ్చిపోయాడు. ఆ తర్వాత నన్ను బయటకు పంపించేయండి.. వాడికి కప్పు ఇచ్చేయండి.. మీరందరూ హ్యాపీగా ఉండండి.. వాడు హ్యాపీగా ఉంటాడు అని అమర్ అనడంతో ప్రోమో ముగిసింది. మొత్తానికి ప్రోమో చూస్తే నామినేషన్స్ ప్రక్రియ ఫుల్‌ హీటెక్కినట్లు తెలుస్తోంది. ఎవరు ఎవరినీ నామినేట్ చేశారో పూర్తి వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. 


  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement