బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌లో పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి టైటిల్ రేసులో ఉన్నారు. మొదటి నుంచీ ఏ ముసుగు వేసుకోకుండా మాట్లాడుతున్నాడు అమర్. అయితే తను చేసే తింగరి పనుల వల్ల సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అవుతుంటాడు. ఇక హౌస్‌లో శివాజీ మొదటి నుంచీ అమర్‌ను టార్గెట్ చేస్తూ అతడిని చులకన చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు. ఈ వైఖరిని తాను కూడా సహించలేకపోయానంటోంది అమర్ భార్య, నటి తేజస్విని.
హౌస్‌లో అడుగుపెట్టాక అంతా మర్చిపోయా
తాజాగా తేజస్విని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కొన్ని విషయాల్లో శివాజీ ప్రవర్తన వల్ల నేను బాధపడ్డాను. ఎందుకలా మాట్లాడుతున్నారు అనుకునేదాన్ని. బహుశా అమర్ టఫ్ కాంపిటీషన్ ఇస్తాడనుకున్నారేమో, అందుకే తనతో అలా ప్రవర్తించారేమో! నేను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లినప్పుడు చాలా అనుకున్నాను, ఎన్నో చెప్పాలనుకున్నాను. కానీ హౌస్‌లోకి వెళ్లాక ఏదీ గుర్తులేదు. అమర్ తప్ప ఎవరూ కనిపించలేదు. తనే అందరినీ పరిచయం చేశాడు. అమర్‌కు శివాజీ అంటే ప్రత్యేక గౌరవం ఉంది. అందుకే నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లాడు, ఆశీర్వాదం తీసుకున్నాం.
ఆ సమస్యతో అమర్‌కు ఫిజియోథెరపీ
అమర్‌కు అనారోగ్యసమస్యలు ఉన్నాయి. బిగ్‌బాస్ షోలోకి వెళ్లేముందు కూడా తనకు విపరీతమైన బ్యాక్‌పెయిన్ ఉంది. హౌస్‌లోకి వెళ్లే ఒకరోజు ముందు కూడా అతడికి ఫిజియోథెరపీ జరిగింది. నీతోనే డ్యాన్స్ షో ఫినాలే రోజు పెయిన్ కిల్లర్స్ ఇంజక్షన్స్ వేయించుకున్నాడు. అంత నొప్పి అనుభవిస్తూనే షోకి వెళ్లాడు. ఇప్పటికీ అతడు నొప్పి అనుభవిస్తున్నాడు. హౌస్‌లో తనకు వెన్ను నొప్పి ఉన్న విషయాన్ని బయటకు చెప్పడం లేదు. ఏ ట్రీట్‌మెంట్ తీసుకోవడం లేదు.
దెబ్బ తగిలితే ఫ్రాక్చర్..
ఎక్కడ సింపతీ అనుకుంటారోనని తన అనారోగ్య సమస్యను ఎవరికీ చెప్పట్లేదని నాకు చెప్పాడు. తనకు నొప్పి తగ్గడానికి డాక్టర్ రాసిచ్చిన క్రీమ్ పంపిస్తూనే ఉన్నాను. అమర్ రోజూ అది రాసుకునే పడుకుంటున్నాడు. తనకు కండరాల బలహీనత కూడా ఉంది. దీనివల్ల ఏదైనా దెబ్బ తగిలితే అక్కడ ఫ్రాక్చర్ అవుతుందని డాక్టర్ చెప్పారు. అయినా సరే ఏమీ లెక్క చేయకుండా అమర్ బిగ్‌బాస్ షోకి వెళ్లాడు. అందుకే మొదట్లో టాస్కులు పెద్దగా ఆడలేకపోయాడు. కానీ తర్వాత ఏదైతే అదైందని ఆడుతూ పోయాడు' అని చెప్పుకొచ్చింది తేజస్విని.
చదవండి: స్టార్ హీరోయిన్ మాజీ భర్తతో నాలుగేళ్లుగా డేటింగ్.. బ్రేకప్‌కు అదే కారణమంటూ..
Comments
Please login to add a commentAdd a comment