
పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించారు నటుడు పి.సత్యారెడ్డి. ఇప్పుడు తన కుమారుడు మనీష్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ జనం ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘ప్రశ్నిస్తా’. అక్షిత కథానాయికగా నటించారు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ వారంలో సెన్సార్ పూర్తి చేసుకుని, వచ్చే వారం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రభుత్వ విధానాలపై ఓ విద్యార్థి నాయకుడు ఏ విధంగా పోరాడాడు.. ఎలా ప్రశ్నించాడు? అన్నది ఈ చిత్రకథ.
వినోదంతో పాటు సమాజానికి మంచి సందేశం ఉంటుంది. మనీష్‌కి ఇది తొలి సినిమా అయినా అనుభవం ఉన్నవాడిలా నటించాడు’’ అన్నారు. రావు రమేశ్, ఆమని, హసీన్, షిప్రా కౌర్, వేణుగోపాల్, ప్రభాస్ శ్రీను, అనంత్, శివపార్వతి, ముంతాజ్, ‘ఆర్‌ఎక్స్ 100’ లక్ష్మణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వెంగి, కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment