
సాక్షి, హైదరాబాద్: అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ప్రొ కబడ్డీ లీగ్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం హుస్సేన్‌సాగర్ వేదికగా జరిగింది. సాగర్‌లోని బుద్ధుని విగ్రహం వద్ద లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు టైటాన్స్ కెప్టెన్ అబోజర్‌తో పాటు జట్టు సభ్యులు, డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ సారథి రోహిత్ కుమార్, సినీ హీరో సందీప్ కిషన్ పాల్గొన్నారు. ఈ సీజన్ తొలి అంచె పోటీలకు నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. 20వ తేదీ నుంచి జరిగే ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్‌తో యు ముంబా జట్టు తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment