తలైవాస్‌ చేజేతులా.. | Sakshi
Sakshi News home page

తలైవాస్‌ చేజేతులా..

Published Thu, Jul 25 2019 8:55 PM

Pro Kabaddi League 7 Dabang Delhi Beat Tamil Thalaivas - Sakshi

హైదరాబాద్‌: ప్రొ కబడ్లీ లీగ్‌ సీజన్‌-7లో మరో హోరాహోరీ మ్యాచ్‌ జరిగింది. ఇరుజట్ల మధ్య విజయం దోబుచూలాడింది. విజేత ఎవరో తేలడానికి చివరి కూత వరకు వేచిచూడాల్సి వచ్చింది. చివరికి దబాంగ్‌ ఢిల్లీదే విజయం కాగా.. తమిళ్‌ తలైవాస్‌ చేజేతాలా ఓటమిపాలైంది. గురువారం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో తమిళ్‌ తలైవాస్‌పై 30-29 తేడాతో దబాంగ్‌ ఢిల్లీ విజయాన్ని అందుకుంది. బుధవారం తెలుగు టైటాన్స్‌పై కూడా ఢిల్లీ ఒకే ఒక పాయింట్‌ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందన్న వరకూ మంచి ఆధిక్యంలో ఉన్న తలైవాస్‌ జట్టు.. చివర్లో అనవసరపు తప్పిదాలతో ఓటమి మూటగట్టుకుంది. మ్యాచ్‌ విజేతన డిసైడ్‌ చేసే చివర కూతలో మంజీత్‌ చిల్లర్‌ బాక్స్‌ దాటడంతో తలైవాస్‌ జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది. దబాంగ్‌ ఢిల్లీ 13 రైడ్‌ పాయింట్లు,  9 టాకిల్‌ పాయింట్లతో అదరగొట్టగా.. తలైవాస్‌ జట్టు 12 రైడ్‌ పాయింట్లు, 11 టాకిల్‌ పాయింట్లతో అందుకోలేకపోయింది.

Advertisement
 
Advertisement
 
Advertisement