నల్లస్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, షఫీ, పోసాని కృష్ణమురళి ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం `రంగు`. కార్తికేయ.వి దర్శకత్వంలో ఎ.పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మాతలు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ బాస్ సీజన్ 2 పాల్గొన్న సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా అతిథులు, చిత్ర బృందం మాట్లాడుతూ...
‘టైటిల్ నాకు బాగా నచ్చింది. సినిమా పాటలు, ట్రైలర్స్ చూస్తుంటే చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. తనీష్ నటన ఎంటో మనం చిన్నతనం నుండి చూస్తున్నాం. అతనికి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను’ అని రాజ్ కందుకూరి పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ..‘ చిన్న కథలకు ఆదరణ పెరుగుతుంది. కథ బాగుంటే సినిమాలు ప్రజాదరణ పొందుతున్నాయి. కథ లేని సినిమాలను ఎన్ని హంగులున్నా ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. రంగు చాలా ఆరోగ్య కరమైన సినిమా.
గాయం లో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని’అనే పాట రాసాను. అది నాకు చాలా తృప్తినిచ్చింది. చాలాకాలం తర్వాత ‘ఎక్కడ ఉంది ఈ చిక్కుముడి’ అంటూ రంగులో ఒక పాట రాయడం జరిగింది. అప్పటికీ ఇప్పటికీ సమాజంలో ఏ మార్పులేదు. మా అబ్బాయికి మంచి పేరు వచ్చినందుకు సంతోషంగా ఉంది. పరుచూరి బ్రదర్స్ కథతో ప్రయాణం చేశారు. ‘రంగు’ లో కనిపించే క్రోథం ఎక్కడికి తీసుకెళ్తుంది ఎక్కడ ముంచుతుంది అనేది కథ, లారా పాత్రలో తనీష్ నటన ఒక రిఫరెన్స్‌లా మిగలుతుంది. ఈ సినిమాతో స్టార్స్ అయినా నేల మీద నక్షత్రాలుగా ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
దిగ్గజాలతో కలసి పనిచేసినందుకు గర్వంగా ఉంది..
హీరో తనీశ్ మాట్లాడుతూ..`నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయ్యింది. నా తొలి సినిమా హిట్ అయిన రోజు నాకు చాలా ఆనందమేసింది. చాలా ఏళ్ల తర్వాత ఇంత ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, పరుచూరి వెంకటేశ్వరరావు వంటి దిగ్గజాలతో కలిసి పనిచేశాను. చాలా రోజుల తర్వాత మా అమ్మ నా కోసం ఈ ఫంక్షన్‌కు వచ్చారు. నా ఎక్స్‌డెంటెడ్ ఫ్యామిలీతో జరుపుకుంటున్న తొలి ఫంక్షన్. ఈ మూడు కారణాలతో నేను చాలా ఆనందంగా ఉన్నాను. కార్తికేయగారు సినిమాను నాతో చేసినందుకు ఆయనకు థాంక్స్. ఇందులో హీరోలు, విలన్స్ లేరు.. అన్ని పాత్రలే. ప్రతి పాత్ర ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదనే విషయాలను నేర్పిస్తుంది. ఈ నెల 23న సినిమా విడుదలవుతుంది` అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యోగీశ్వర శర్మ, సినిమాటోగ్రాఫర్: టి.సురేందర్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment