hero tanish
-
మోహన్ బాబు తిడుతుంటే విష్ణు ఆపాడు: తనీష్
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన 11మంది రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో తనీష్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలింగ్ రోజు తనను మోహన్ బాబు బూతులు తిట్టారని ఎమోషనల్ అయ్యాడు. 'నేను ఏరోజూ మీడియా ముందుకు రాలేదు. వివాదాలకు మొదట్నుంచి నేను దూరంగా ఉన్నాను. నాకు ఓటేసిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. పోలింగ్ రోజు మోహన్ బాబు నన్ను బూతులు తిట్టారు. ఆపేందుకు ప్రయత్నించిన బెనర్జీని సైతం మోహన్ బాబు తిట్టిపోశారు. మంచు విష్ణు మధ్యలో జోక్యం చేసుకుని మమ్మల్ని ఆపారు. మా అమ్మను కించపరిచే బూతులు మోహన్‌బాబు తిట్టారు. నాకు నా తల్లే సర్వస్వం. అలాంటిది ఆమెను తిడుతుంటే చాలా బాధేసింది. గతంలో వివిధ సందర్భాల్లో నరేష్ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది' అంటూ తనీష్ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారు: బెనర్జీ -
సంచలనం: బెంగళూరు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులు
బెంగళూరు: తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు సినిమా ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలతో పాటు 8 మంది ఈవెంట్ మేనేజర్ల పాత్ర ఉందని సమాచారం. ఇప్పటికే సినిమా హీరో తనీశ్‌ని బెంగళూరు పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. తనీశ్‌తో పాటు హైదరాబాద్ చెందిన వ్యాపారవేత్త సందీప్ రెడ్డిని పోలీసులు విచారించారు. ఈవెంట్ మేనేజర్ కలహరెడ్డితోపాటు, రతన్ రెడ్డిలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సందీప్ రెడ్డి, తనిశ్ స్టేట్మెంట్ మేరకు నాలుగు కేసులను నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ కేసులో సందీప్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన కలహర్ రెడ్డితో కలిసి సందీప్ బెంగళూరు వెళ్లాడు. అక్కడ నిర్మాత శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో కలహర్ రెడ్డితో కలిసి పాల్గొన్నాడు. 2019లో శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో ఎమ్మెల్యేతో పాటు పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఆ పార్టీలోనే కలహర్ రెడ్డి, రతన్ రెడ్డి, శ్రీను రెడ్డి, నటుడు తనీశ్ కలిసి పాల్గొన్నారు. మూడు రోజులపాటు శంకర్ రౌడీ శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో ఎంజాయ్ చేసినట్లు సందీప్ వివరించాడు. దీంతో పాటు అక్కడ ఇరానీ గర్ల్స్‌తో కలిసి డ్యాన్స్‌లతో ఎంజాయ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మందు, విందు, చిందులతో మూడు రోజుల పాటు హంగామా చేశామని చెప్పారు. అయితే హైదరాబాద్‌కు వచ్చే సమయంలో శంకర్ గౌడ్ నుంచి రతన్ రెడ్డి కోకెన్ తీసుకుని వచ్చాడని సమాచారం. అయితే హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహిస్తున్న 8 మంది పాత్ర ఉందని విచారణలో తేలింది. పలు పబ్బుల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకుల పాత్ర ఉందని చెప్పిన సందీప్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. వీరిలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు ప్రముఖుల పేర్లను వెల్లడించాడు. నగరంలోని పలు పబ్బుల్లో డ్రగ్స్ బిజినెస్‌పై కూడా ప్రదీప్ సమాచారం ఇచ్చాడంట. అయితే శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో ఆ మూడు రోజుల పాటు ఒక ఎమ్మెల్యే పాల్గొన్నట్టు సమాచారం. ఇరానీ అమ్మాయిలతో కలిసి ఆయన కూడా డ్యాన్స్‌లు చేశాడని తెలిసింది. రాజశేఖర్, విక్కీ మల్హోత్ర డేనియల్, మస్తాన్ చంద్‌తో కలిసి పార్టీని ఎంజాయ్ చేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కలహర్ రెడ్డి, రతన్ రెడ్డిలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు పంపించారు. రెండుసార్లు పంపిచినా హాజరు కాకపోడంతో తాజా నోటీస్‌కు స్పందించకుంటే కలహర్ రెడ్డి, రతన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు హెచ్చరించారు. -
బెంగళూరు డ్రగ్స్ కేసులో సినీనటుడు తనీష్ కు నోటీసులు
-
డ్రగ్స్ కలకలం.. నాకేం సంబంధం లేదు : తనీష్
బెంగుళూరు : టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఇటీవలె సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో విచారణకు రావాలంటూ హీరో తనీష్‌కు బెంగుళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు జరిగే విచారణకు హాజరు కావాలంటూ తనిష్‌తో పాటు మరో ఐదుగురికి పోలీసులు సమన్లు జారీ చేశారు. వీరిలో ప్రముఖ నిర్మాత శంకర్ గౌడతో పాటు ఓ వ్యాపార వేత్త కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాత శంకర్ గౌడ ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొన్న పలువురు సెలబట్రీలకు నోటీసులు పంపినట్లు బెంగుళూరు పోలీసులు ధృవీకరించారు. తాజగా ఈ విషయంపై హీరో తనీష్ స్పందిచారు. తనకు బెంగుళూరు పోలీసులు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ డ్రగ్స్ తీసుకున్నందుకు నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నాడు. 2017లో బెంగుళూరులో నిర్మాత శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీకి తాను వెళ్లింది నిజమేనని, కానీ అక్కడ ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని వివరించాడు. 67 ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద తనకు నోటీసులు వచ్చాయని, ఇది కేవలం ఆ కేసుకి సంబంధించి విట్నెస్గా మాత్రమే బెంగుళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలిపాడు. విచారణకు హాజరు కావల్సిందిగా సమన్లు జారీ అయిన నేపథ్యంలో ప్రస్తుతం తనీష్ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. ఈ కేసులో మొదట ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసి విచారించగా మొత్తం వ్యవహారం బయటపడింది. ఇక గతంలోనూ టాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తనీష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. చదవండి : (శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కలకలం) (రాగిణి, సంజనల ఫోన్ల గుట్టు వీడింది) -
వైఎస్సార్సీపీలో చేరిన యువహీరో
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందడి కొనసాగుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు వెల్లువలా జనం వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారు. తాజాగా యువ హీరో తనీష్ వైఎస్సార్సీపీలో చేరారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. అతడిని వైఎస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు పాటుపడుతానని ప్రకటించారు. వైఎస్సార్సీపీలోకి జీవానందరెడ్డి అనంతపురం జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జీవానందరెడ్డి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆయనను వైఎస్ జగన్ ఆహ్వానించారు. -
‘రంగు’లో హీరోలు విలన్లు ఉండరు
నల్లస్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, షఫీ, పోసాని కృష్ణమురళి ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం `రంగు`. కార్తికేయ.వి దర్శకత్వంలో ఎ.పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మాతలు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ బాస్ సీజన్ 2 పాల్గొన్న సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా అతిథులు, చిత్ర బృందం మాట్లాడుతూ... ‘టైటిల్ నాకు బాగా నచ్చింది. సినిమా పాటలు, ట్రైలర్స్ చూస్తుంటే చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. తనీష్ నటన ఎంటో మనం చిన్నతనం నుండి చూస్తున్నాం. అతనికి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను’ అని రాజ్ కందుకూరి పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ..‘ చిన్న కథలకు ఆదరణ పెరుగుతుంది. కథ బాగుంటే సినిమాలు ప్రజాదరణ పొందుతున్నాయి. కథ లేని సినిమాలను ఎన్ని హంగులున్నా ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. రంగు చాలా ఆరోగ్య కరమైన సినిమా. గాయం లో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని’అనే పాట రాసాను. అది నాకు చాలా తృప్తినిచ్చింది. చాలాకాలం తర్వాత ‘ఎక్కడ ఉంది ఈ చిక్కుముడి’ అంటూ రంగులో ఒక పాట రాయడం జరిగింది. అప్పటికీ ఇప్పటికీ సమాజంలో ఏ మార్పులేదు. మా అబ్బాయికి మంచి పేరు వచ్చినందుకు సంతోషంగా ఉంది. పరుచూరి బ్రదర్స్ కథతో ప్రయాణం చేశారు. ‘రంగు’ లో కనిపించే క్రోథం ఎక్కడికి తీసుకెళ్తుంది ఎక్కడ ముంచుతుంది అనేది కథ, లారా పాత్రలో తనీష్ నటన ఒక రిఫరెన్స్లా మిగలుతుంది. ఈ సినిమాతో స్టార్స్ అయినా నేల మీద నక్షత్రాలుగా ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు. దిగ్గజాలతో కలసి పనిచేసినందుకు గర్వంగా ఉంది.. హీరో తనీశ్ మాట్లాడుతూ..`నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయ్యింది. నా తొలి సినిమా హిట్ అయిన రోజు నాకు చాలా ఆనందమేసింది. చాలా ఏళ్ల తర్వాత ఇంత ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, పరుచూరి వెంకటేశ్వరరావు వంటి దిగ్గజాలతో కలిసి పనిచేశాను. చాలా రోజుల తర్వాత మా అమ్మ నా కోసం ఈ ఫంక్షన్‌కు వచ్చారు. నా ఎక్స్‌డెంటెడ్ ఫ్యామిలీతో జరుపుకుంటున్న తొలి ఫంక్షన్. ఈ మూడు కారణాలతో నేను చాలా ఆనందంగా ఉన్నాను. కార్తికేయగారు సినిమాను నాతో చేసినందుకు ఆయనకు థాంక్స్. ఇందులో హీరోలు, విలన్స్ లేరు.. అన్ని పాత్రలే. ప్రతి పాత్ర ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదనే విషయాలను నేర్పిస్తుంది. ఈ నెల 23న సినిమా విడుదలవుతుంది` అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యోగీశ్వర శర్మ, సినిమాటోగ్రాఫర్: టి.సురేందర్ రెడ్డి. -
హీరో తనీష్ పై కేసు
హైదరాబాద్: సినీ హీరో తనీష్‌పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో న్యూసెన్స్ కేసు నమోదైంది. గురువారం రాత్రి హీరో తనీష్ తన కారులో జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ముందు వెళ్తున్న సురేష్ అనే స్కూటరిస్టును ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో బాధితుడు కారును వెంబడించి జూబ్లీహిల్స్ చెక్ పోస్టులో అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు ఇద్దరిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.