![Maa Elections 2021: Hero Tanish Emotional In Press Meet - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/12/Tanish-speech.jpg.webp?itok=tG92Y7wf)
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన 11మంది రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో తనీష్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలింగ్ రోజు తనను మోహన్ బాబు బూతులు తిట్టారని ఎమోషనల్ అయ్యాడు.
'నేను ఏరోజూ మీడియా ముందుకు రాలేదు. వివాదాలకు మొదట్నుంచి నేను దూరంగా ఉన్నాను. నాకు ఓటేసిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. పోలింగ్ రోజు మోహన్ బాబు నన్ను బూతులు తిట్టారు. ఆపేందుకు ప్రయత్నించిన బెనర్జీని సైతం మోహన్ బాబు తిట్టిపోశారు. మంచు విష్ణు మధ్యలో జోక్యం చేసుకుని మమ్మల్ని ఆపారు.
మా అమ్మను కించపరిచే బూతులు మోహన్‌బాబు తిట్టారు. నాకు నా తల్లే సర్వస్వం. అలాంటిది ఆమెను తిడుతుంటే చాలా బాధేసింది. గతంలో వివిధ సందర్భాల్లో నరేష్ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది' అంటూ తనీష్ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారు: బెనర్జీ
Comments
Please login to add a commentAdd a comment