![Hero Tanish Joins YSR Congress Party - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/18/Tanish_YSRCP.jpg.webp?itok=zVRMw88o)
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందడి కొనసాగుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు వెల్లువలా జనం వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారు. తాజాగా యువ హీరో తనీష్ వైఎస్సార్‌సీపీలో చేరారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. అతడిని వైఎస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు పాటుపడుతానని ప్రకటించారు.
వైఎస్సార్‌సీపీలోకి జీవానందరెడ్డి
అనంతపురం జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జీవానందరెడ్డి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆయనను వైఎస్ జగన్ ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment