
చారి, ఎన్.శంకర్, తోట కృష్ణ
‘‘దక్షయజ్ఞం’ టైటిల్ చాలా బాగుంది. చారిగారు మంచి అభిరుచి, అనుభవం గల నిర్మాత. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే కథలను ఎన్నుకోవడం ఆయన ప్రత్యేకత. దర్శకుడు తోట కృష్ణ నిర్మాతల పక్షపాతి. ‘దక్షయజ్ఞం’ టీజర్ చాలా బాగుంది’’ అన్నారు దర్శకుడు ఎన్. శంకర్. సూర్య, మధులగ్న దాస్, శివప్రసాద్, సంజన, మేఘనా చౌదరి, సుమన్ శెట్టి ముఖ్య తారలుగా తోట కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దక్షయజ్ఞం‘ (ది టార్గెట్).
మహతి సాయి జస్వంత్ సమర్పణలో కస్తూరి ఫిలిమ్స్, విజయలక్ష్మీ మూవీస్ పతాకాలపై మెట్రో స్టూడియోస్ అధినేత ఈవీఎన్ చారి సారధ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ని ఎన్. శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకం ఉంది. తోట కృష్ణ– చారిగారి కాంబినేషన్‌లో మరెన్నో మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘనశ్యామ్, కెమెరా: ఆనంద్, నిర్మాతలు: చిన్న శ్రీశైలం యాదవ్, పున్న శ్యామ్‌రావు, బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్.
Comments
Please login to add a commentAdd a comment