మిర్యాలగూడ రూరల్(నల్లగొండ): విద్యుత్‌షాక్ కు గురై ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది మండలంలోని ఆల్లగడప గ్రామానికి చెందిన శైలజ(35)కు ఇంట్లో కరెంటు వైరులు తగలి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో మృతురాలి కుంటుంబం విషాదంలో మునిగిపోయింది.