మహానంది(కర్నూలు): మహానంది మండలం మసీదుపురం గ్రామంలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కమలమ్మ(26) అనే వివాహిత ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి మృతిచెందింది. పొద్దున్నే పాలు పిండటానికి పశువులపాక వద్దకు వెళ్లినపుడు ఘటన జరిగింది. కమలమ్మకు ఇద్దరు పిల్లలున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.