
శైలజా ! మేం ఎలా సహాయపడగలం?
న్యూఢిల్లీ
విదేశాల్లో అనుకోని విపత్తులలో దుర్మరణానికి గురైన, లేదా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ చాలా వేగంగా స్పందిస్తున్నారు. ఇటీవల బ్రస్సెల్స్ పేలుళ్ల సందర్భంగా కూడా భారతీయుల క్షేమ సమాచారాలను సోషల్ మీడియాలో షేర్ చేసి శభాష్ అనిపించుకున్నారు. ఈ కోవలోనే ఆదుకోమంటూ మంత్రిని ఆశ్రయించిన సింగపూర్ కు చెందిన ఓ బాధితురాలి ట్విట్ కి స్పందించారు.
తన భర్త ప్రవీణ్ కుమార్ అనుకోని అనారోగ్యానికి గురయ్యారని, ఈ ఆపద సమయంలో ఆదుకోవాలని కోరుతూ సింగపూర్ లో వుంటున్న శైలజ కత్తుల ట్విట్ చేశారు. గత ఎనిమిదేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నతన భర్త ప్రవీణ్ కు మెదడులో రక్తస్రావం కారణంగా వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స చేశారని పేర్కొంది. దీనికి ఇప్పటికే 40వేల డాలర్ల బిల్ వచ్చిందని తెలిపింది. ఫైనల్ బిల్లు సుమారు 80 వేల డాలర్లు చేరే అవకాశం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రవీణ ఆరోగ్య పరిస్థతి విషమంగానే ఉందని, వైద్య ఖర్చుల నిమిత్తం తమను ఆదుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా వేడుకుంది. దీనికి స్పందించిన కేంద్రమంత్రి శైలజా మీకు ఎలా సాయపడగలమంటూ రీ ట్విట్ చేశారు. ఆమెకు సాధ్యమైనంత మేర సాయం చేసేందుకు యోచిస్తున్న సానుకూల సంకేతాలను అందించారు. మరి శైలజ ఈ అనుకోని ఆపద నుంచి ఎలా బయటపడుతుందో, కేంద్రమంత్రి ఆమెకు ఎలాంటి సాయం చేయనున్నారో వేచి చూడాలి.
Shailaja - How can we help you ? pic.twitter.com/4rbRUh5HGb https://t.co/oFvIyJotn6
— Sushma Swaraj (@SushmaSwaraj) March 26, 2016