సూడాన్‌లో సైన్యం, పారామిలటరీల మధ్య ఘర్షణలు తారా స్థాయికి చేరకుని హింసాత్మకంగా మారిని సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో సుమారు 300 మంది దాక చనిపోయారు. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూడాన్‌లోని భారతీయులను అప్రమత్తం చేయడమే గాక వారిని తీసుకొచ్చే ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా అధికారులతో అక్కడ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు కూడా. ఈ క్రమంలోనే మీనాక్షి అగర్వాల్ అనే మహిళ మోదీజీ నా భర్త కూడా సూడాన్‌లో చిక్కుపోయారు, వెనక్కి తీసుకురండి. అంటూ ట్వీట్ చేసింది. ఈ మేరకు మీనాక్షి నాభర్తను ఎలాగైన తీసుకురావలని కేంద్ర విదేశాంగ మంత్రి, ప్రధాని మోదీని ట్విట్టర్‌లో కోరారు.
సూడాన్‌లో భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్న నాభర్త తోసహ ఇతర భారతీయులను కూడా తిరిగి తీసుకువచ్చి.. తన ఆందోళనకు ఉపశమనం ఇవ్వగలరని ఆశిస్తున్నా అని ఆమె ట్వీట్ చేశారు. అంతేగాదు మీరు వారిని తీసుకొచ్చేందుకు చేస్తున్న మీ ప్రయత్నాలకు, చర్యలకు ధన్యావాదాలు అని కూడా చెప్పారు మీనాక్షి.
@narendramodi @DrSJaishankar I am hopeful that you will be able to set my worries to rest and bring back my husband and other trapped Indians from #sudan #khartoum from the horrific situation there. Thank you for your efforts and initiative https://t.co/b9cugBmioC
— Meenakshi agrawal (@Meenakshiagra17) April 21, 2023
(చదవండి: రాజస్తాన్‌లోని కాంగ్రెస్‌కు షాక్ మీద షాక్..కలకలం రేపిన వ్యక్తి..)
Comments
Please login to add a commentAdd a comment