bring back
-
'మోదీజీ నా భర్తను వెనక్కి తీసుకురండి'! ఓ మహిళ విజ్ఞప్తి
సూడాన్‌లో సైన్యం, పారామిలటరీల మధ్య ఘర్షణలు తారా స్థాయికి చేరకుని హింసాత్మకంగా మారిని సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో సుమారు 300 మంది దాక చనిపోయారు. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూడాన్‌లోని భారతీయులను అప్రమత్తం చేయడమే గాక వారిని తీసుకొచ్చే ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా అధికారులతో అక్కడ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు కూడా. ఈ క్రమంలోనే మీనాక్షి అగర్వాల్ అనే మహిళ మోదీజీ నా భర్త కూడా సూడాన్‌లో చిక్కుపోయారు, వెనక్కి తీసుకురండి. అంటూ ట్వీట్ చేసింది. ఈ మేరకు మీనాక్షి నాభర్తను ఎలాగైన తీసుకురావలని కేంద్ర విదేశాంగ మంత్రి, ప్రధాని మోదీని ట్విట్టర్లో కోరారు. సూడాన్‌లో భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్న నాభర్త తోసహ ఇతర భారతీయులను కూడా తిరిగి తీసుకువచ్చి.. తన ఆందోళనకు ఉపశమనం ఇవ్వగలరని ఆశిస్తున్నా అని ఆమె ట్వీట్ చేశారు. అంతేగాదు మీరు వారిని తీసుకొచ్చేందుకు చేస్తున్న మీ ప్రయత్నాలకు, చర్యలకు ధన్యావాదాలు అని కూడా చెప్పారు మీనాక్షి. @narendramodi @DrSJaishankar I am hopeful that you will be able to set my worries to rest and bring back my husband and other trapped Indians from #sudan #khartoum from the horrific situation there. Thank you for your efforts and initiative https://t.co/b9cugBmioC — Meenakshi agrawal (@Meenakshiagra17) April 21, 2023 (చదవండి: రాజస్తాన్‌లోని కాంగ్రెస్‌కు షాక్ మీద షాక్..కలకలం రేపిన వ్యక్తి..) -
త్వరలో రూ.1000 నోట్లు..?
న్యూఢిల్లీ: రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలోనే కొత్త రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టనుందట. ఇప్పటికే చరిత్రలో తొలిసారి కొత్త రూ. 200 నోట్లను జారీచేసిన ఆర్బీఐ త్వరలోనే ఈ కొత్త నోట్లను జారీ చేయనుంది. తాజా నివేదిక ప్రకారం 2017, డిసెంబర్ నాటికి కొత్త రూ. 1000 నోట్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రూ.200, రూ. 500, రూ.2,000ల మధ్య ఉన్న ఖాళీని పూరించడానికి రూ.1,000 నోటును తిరిగి తీసుకురానున్నట్టు సమాచారం. మెరుగైన భద్రతా లక్షణాలు, కొత్త డిజైన్‌తో రూ.1000 కరెన్సీ నోట్లను లాంచ్ చేయనుంది. డీఎన్ఏ మనీ రిపోర్టు ప్రకారం మైసూర్, సల్బోనిలో ప్రింటింగ్ ప్రెస్ ప్రింటర్లు కొత్తగా రూ.1,000 నోట్లను ముద్రించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 2017 నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయని నివేదించింది. అయితే తాజా అంచనాలు కేంద్ర బ్యాంకు ఆర్బీఐ ముందు చెప్పినదానికి విరుద్ధంగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ రూ.1000 రూపాయలను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని ప్రకటించారు. కాగా తక్కువ విలువ కలిగిన కరెన్సీలు లేకపోవడంతో కేంద్ర బ్యాంకు ఆగస్ట్ 25న కొత్త రూ.200, రూ 50నోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
మాల్యాను వెనక్కి రప్పిస్తాం
న్యూఢిల్లీ: రుణాలు ఎగ్గొట్టి తప్పించుకు తిరుగుతున్న వ్యాపార వేత్త విజయ మాల్యా వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. అతణ్ణి దేశానికి తిరిగి రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన జైట్లీ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను తిరిగి దేశానికి తీసుకురావడానికి దర్యాప్తు సంస్థలు అన్ని ప్రయత్నాలు చేస్తాయన్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు. ఆయన్ని ఇండియాకు రప్పించడానికి రెండు ప్రత్యేక మార్గాలు ఉన్నాయన్నారు. , ఒకటి బహిష్కరణ మరొకటి రప్పించడమని తెలిపారు. ఈ విషయంలో బ్రిటన్ తమకు సహాయపడేలా లేదన్నారు. ఒకసారి ఎవరైనా చట్టబద్ధంగా వారి దేశంలోకి ప్రవేశించిన వ్యక్తిని ఆదేశం బహిష్కరిందని జైట్లీ అన్నారు. పాస్ పోర్ట్ రద్దు చేయడం దేశ బహిష్కరణ కింద రాదనే వైఖరిని బ్రిటన్ ప్రభుత్వం తీసుకుందన్నారు. మరోవైపు కోర్టులో అభియోగాలు నమోదై చార్జిషీటు దాఖలైన తరువాత మాల్యాను దేశానికి రప్పించే ప్రయత్నాలు చట్ట ప్రకారం చేయొచ్చన్నారు. అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని యూకే ..మాల్యా ను అప్పగించే దిశగా దర్యాప్తు సంస్థలు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదే విషయంలో పార్లమెంటులో కూడా ప్రస్తావించిన జైట్లీ ఛార్జిషీట్ దాఖలైన తర్వాత భారతదేశానికి రప్పించే ప్రక్రియ ప్రారంభకానుట్టుతెలిపారు. కాగా బ్యాంకుల కన్సార్టియానికి 9 వేలకు కోట్లకు పైగా బాకీ పడ్డ విజయ్ మాల్యా గత మార్చి 2 న భారతదేశం విడిచి బ్రిటన్ కు పారిపోయిన సంగతి తెలిసిందే. -
”మత మార్పిడి నిరోధక చట్టాన్ని తేవాలి”