సాక్షి,మంచిర్యాలటౌన్: పాతమంచిర్యాలకు చెందిన బోర్లకుంట అక్షిత(9) బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోందని ఈ నెల 20న ‘సాక్షి’లో ప్రచురితం కాగా, మంత్రి కే.తారకరామారావుకు పలువురు ట్వీట్ చేశారు. మంత్రి స్పందిస్తూ.. ఆ చిన్నారి వైద్యానికి అవసరమైన సాయం తన బృందం సభ్యు ల ద్వారా అందిస్తానని ట్విట్టర్ ద్వారా తెలి పారు. మంత్రి కార్యాలయం నుంచి చిన్నా రి ఆరోగ్యంపై ఫోన్ చేసి ఆరా తీయగా, చికిత్సకు అవసరమయ్యేందుకు సహాయం అందిస్తామని భరోసా కల్పించారు.
మరో ఘటనలో..
వ్యసనాలకు బానిసై భవితను నాశనం చేసుకోవద్దు’
బెల్లంపల్లి: దుర్వ్యసనాలకు బానిసై బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసు ఆధ్వర్యంలో ‘యువత భవిత’ కార్యక్రమం స్థానిక ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ లక్ష్యాన్ని ఎంచుకుని సాధించడానికి కఠోర సాధన చేయాలని సూచించారు. లక్ష్యం లేకుండా సరదా లు, సెల్‌ఫోన్లు, మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారని, ఈ తీరు అత్యంత దురదృష్టకరమని అ న్నారు. బెల్లంపల్లి షీటీమ్ ఇంచార్జి, ఎస్సై మానస మాట్లాడుతూ బాల్య వివాహాలు, ఆన్‌లైన్ మోసాల సమాచారాన్ని డయల్ 100 కు అందించాలని, 6303923700 షీటీమ్ నంబర్‌కు వాట్సాప్ చేయాలని తెలిపారు. బెల్లంపల్లి రూరల్ సీఐ కె.జగదీష్, ఎస్సైలు సమ్మయ్య, గంగాధర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment