నవవధువు శైలజపై దాడిచేసి దారుణంగా హింసించిన కేసులో.. నిందితుడు రాజేశ్‌కు లైంగిక పటుత్వ పరీక్ష నిర్వహించేందుకు కోర్టు బుధవారం పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే పోలీసులు ఉపాధ్యాయుడైన రాజేశ్‌పై పలు అభియోగాలు మోపారు. లైంగిక పటుత్వ పరీక్ష నిర్వహించిన అనంతరం ఆ పరీక్షల ఆధారంగా మరిన్ని అభియోగాలు మోపాలని భావిస్తున్నారు. రాజేశ్ తండ్రిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.