నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్‌ పోస్ట్‌ | Short Film Actress, Instagram Influencer Nayani Pavani Father Passed Away | Sakshi
Sakshi News home page

Nayani Pavani: నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్‌ పోస్ట్‌

Published Mon, Jan 2 2023 11:47 AM | Last Updated on Mon, Jan 2 2023 11:58 AM

Short Film Actress, Instagram Influencer Nayani Pavani Father Passed Away - Sakshi

సోషల్‌ మీడియా స్టార్‌, నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో, సంతోషంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాల్సిన ఆమె తీవ్ర దు:ఖంలో మునిగిపోయింది. శనివారం(డిసెంబర్‌ 31) ఆమె తండ్రి కన్నుమూశారు. ఇదే విషయాన్ని నటి పావని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాగా  పలు వెబ్‌ సిరీస్‌, షార్ట్‌ ఫిలింలో నటించిన నయని పావని ప్రముఖ డాన్స్‌ షో ఢీతో మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది.

అలాగే మరో యూట్యూబ్‌, సోషల్‌ మీడియా స్టార్‌ శ్వేతా నాయుడి కలిసి ఎక్కువగా నయని రీల్స్‌ చేస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలో తండ్రి మృతిపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక ఎమోషనల్‌ అయ్యింది. ఈ మేరకు ఆమె పోస్ట్‌ చేస్తూ.. ‘ఒక్క జన్మలోనే 100 జన్మల ప్రేమందించావు. కానీ, నాకు అది సరిపోలేదు. ఇంకా కావాలి డాడీ. ఈ బాధని నా నుంచి ఎవరూ తీసుకోలేరు. నాకు అయిన పెద్ద గాయమిది. దీన్ని ఎవరూ నయం చేయలేరు. ఇక నిన్ను చూడలేను అనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నిన్ను ఇంకా చూడలేననే ఆలోచన కూడా కష్టంగా ఉంది డాడీ. ఇకపై పండోడా అని నన్ను ఎవరు పిలుస్తారు? రోజుకి ఐదుసార్లు ఎవరు కాల్ చేస్తారు? ఓర్పుగా నాతో ఎవరు ఉంటారు? నువ్వు ఏమైనా చేయ్.. నీ లైఫ్ నీ ఇష్టం, నేను నిన్ను నమ్ముతున్నాను అని ఎవరు చెప్తారు?

నా పెళ్లికి నన్ను ఎత్తుకుని తీసుకెళ్తావు అనుకున్నా.. కానీ అంతలోనే నిన్ను ఇలా ఎత్తుకెళ్తాం అనుకోలేదు. ఇది చాలా అన్ ఫెయిర్. 2022 నాకు ఇంతటి విషాదం ఇస్తుందని అనుకొలేదు, ఇక 2023లోకి అస్సలు ఎంటర్ అవ్వాలని లేదు’ అంటూ పావని భావోద్వేగానికి లోనయ్యింది. ఇక ఆమె పోస్టర్‌ శ్వేతా నాయుడుతో పాటు పలువుకు సోషల్‌ మీడియా స్టార్‌ స్పందిస్తున్నారు. ‘ధైర్యంగా ఉండు.. నీకు మేము ఉన్నాం’ అంటూ ఆమెకు ఓదార్పును ఇస్తున్నారు. కాగా ఆమె సమయం లేదు మిత్రమా, ఎంత ఘాటు ప్రేమ, పెళ్లి చూపులు 2.0, నీవెవరో, బబ్లూ vs సుబ్బులు కేరాఫ్ అనకాపల్లి వంటి షార్ట్ ఫిలింస్‌లో నటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement