'సార్‌' గా వస్తున్న ధనుష్.. లిరికల్ సాంగ్ రిలీజ్ | Dhanush Latest Movie Sir Banjara Lyrical Song release | Sakshi
Sakshi News home page

Banjara Lyrical Song: 'ఆడవుంది నీవే.. ఈడ ఉంది నీవే' .. బంజారా సాంగ్ రిలీజ్

Published Tue, Jan 17 2023 9:09 PM | Last Updated on Tue, Jan 17 2023 9:10 PM

Dhanush Latest Movie Sir Banjara Lyrical Song release - Sakshi

తమిళ నటుడు ధనుష్, సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'సార్'. వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో  నిర్మిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ సమర్పిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉండగా.. ఈ చిత్రంలోని బంజారా అంటూ సాగే సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 

తాజాగా విడుదలైన 'బంజారా' లిరికల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందులోని పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి.తెలుగు, తమిళ భాషల్లో ఈసినిమాను 17 ఫిబ్రవరి, 2023న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. 

ఈ పాటు ప్రముఖ తెలుగు గీత రచయిత సుద్దాల అశోక్ తేజ రాశారు. మూడు దశాబ్దాల సినీ జీవితంలో ఆయన ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోశారు.  'నేను సైతం', 'సారంగ దరియా'పాటలు రాసిన ఆయన మరో మధుర గీతాన్ని అందించారు. ఈ చిత్రంలో సాయికుమార్, తనికెళ్ల భ‌ర‌ణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు నటిస్తున్నారు. జీవీ ప్ర‌కాష్‌కుమార్‌ ఈసినిమాకు సంగీతమందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement