జలమండలి వందరోజుల కార్యాచరణ!
* ప్రణాళికలో మార్పులు చేయాలని మంత్రి సూచన..
* 18న మరోసారి సమావేశం
సాక్షి,సిటీబ్యూరో: రాబోయే వేసవిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందుకుగాను వంద రోజుల్లో చేపట్టాల్సిన అత్యవసర పనులపై రూ.78.25 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మంగళవారం సచివాలయంలో మున్సిపల్, ఐటీ,పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశంలో జలమండలి ఎండీ జనార్దన్‌రెడ్డి, డెరైక్టర్లు సత్యనారాయణ, కొండారెడ్డి, రామేశ్వర్‌రావు, సత్యసూర్యనారాయణ, ఎల్లాస్వామి, శర్మ ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించారు.
అయితే ఈ ప్రతిపాదనల్లో పలు మార్పులు చేయాలని మంత్రి సూచించినట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలోప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని మంత్రి సూచించారు. దీంతో ఈనెల 18న మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
శివారు ప్రాంతాల్లో చేపట్టనున్న పనులివే:
♦ శివార్లలో జంక్షన్ పనుల పూర్తి, నీటి సరఫరా పునరుద్ధరణకు:రూ.2.90 కోట్లు
♦ రిజర్వాయర్లు, వాల్వ్‌ల లీకేజీల నివారణకు:రూ.1.75 కోట్లు
♦ అదనంగా నీటి ఫిల్లింగ్ కేంద్రాల ఏర్పాటుకు:రూ.50 లక్షలు
♦ రిజర్వాయర్ల శుద్ధికి:రూ.80 లక్షలు
♦ కలుషిత జలాల నివారణకు:రూ.3.75 కోట్లు
♦ అదనంగా ఎయిర్‌వాల్వ్‌లు, స్లూయిజ్‌వాల్వ్‌ల ఏర్పాటు:రూ.80 లక్షలు
♦ పంపులు, మోటార్ల మరమ్మతులకు:రూ.4 కోట్లు
♦ ప్రదర్శన బోర్డుల ఏర్పాటుకు:రూ.50 లక్షలు
♦ పైపులైన్లలో లీకేజీల నివారణకు:రూ.2 కోట్లు
♦ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల శుద్ధికి:రూ.90 లక్షలు
♦ విద్యుత్ మోటార్ల మరమ్మతులకు:రూ.5కోట్లు
♦ దెబ్బతిన్న మోటార్ల స్థానంలో నూతన మోటార్ల ఏర్పాటుకు:రూ.2 కోట్లు
♦ ట్రాంక్‌మెయిన్‌పైపులైన్లపై ఉన్న వాల్వ్‌ల మరమ్మతులకు:రూ.2కోట్లు
♦ కెపాసిటర్ల కొనుగోలుకు:రూ.1 కోటి
♦ బటర్‌ఫ్లై వాల్వ్‌ల కొనుగోలుకు:రూ.1.50 కోట్లు
♦ గోదావరి నీటిపథకంలో క్లోరినేషన్ ప్లాంట్ల ఏర్పాటు:రూ.50 లక్షలు
♦ నీటి నమూనాలు సేకరించే సిబ్బంది నియామకం:రూ.10 లక్షలు
♦ కృష్ణా,గోదావరి జలాల అత్యవసర పంపింగ్‌కు:రూ.10 లక్షలు
♦ ఇంకుడు గుంతల నిర్మాణానికి:రూ.3 కోట్లు
♦ నూతనంగా నీటిమీటర్ల ఏర్పాటు:రూ.3 కోట్లు
జలమండలి ప్రతిపాదనలివే..!
⇒ నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ధికి రూ.2.85 కోట్లు
⇒ రిజర్వాయర్లు, పైపులైన్ల లీకేజీల నివారణ, వాల్వ్‌ల మరమ్మతుకు: రూ.2.25 కోట్లు
⇒ సరఫరా వ్యవస్థ లేని ప్రాంతాల్లో స్టాటిక్ ట్యాంకుల నిర్మాణానికి :రూ.1.20 కోట్లు
⇒ రిజర్వాయర్ల శుద్ధి,పెయింటింగ్, ప్రహరీల నిర్మాణం:రూ.10.80 కోట్లు
⇒ కలుషిత నీటి సమస్య నివారణకు:రూ.3 కోట్లు
⇒ అదనంగా ఎయిర్‌వాల్వ్‌లు,స్లూయిజ్ వాల్వ్‌ల ఏర్పాటు:రూ. 75 లక్షలు
⇒ చేతిపంపులు, బోరుబావుల మరమ్మతులకు: రూ.1.50 కోట్లు
⇒ నీటిసరఫరా వేళల బోర్డుల ఏర్పాటుకు రూ.90 లక్షలు
⇒ మ్యాన్‌హోళ్ల పునరుద్ధరణ:రూ.1.08 కోట్లు
⇒ మ్యాన్‌హోళ్ల ఎత్తు పెంపునకు:రూ.1.35 కోట్లు
⇒ మురుగు సమస్యలు తలెత్తుతున్న ప్రాంతాల్లో అదనపు పైపులైన్ల ఏర్పాటుకు:రూ.2.70 కోట్లు
⇒ మురుగునీటి పైపులైన్ల ప్రక్షాళన:రూ.2.07 కోట్లు
⇒ నూతన మ్యాన్‌హోళ్ల ఏర్పాటుకు:రూ.90 లక్షలు
⇒ సిల్ట్‌చాంబర్ల నిర్మాణానికి:రూ.90 లక్షలు
100 రోజులు @ రూ.78.25 కోట్లు
Published Wed, Feb 17 2016 1:34 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement