లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి పోటీ చేయనున్నారంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ తన మేనల్లుడు తేజ్ ప్రతావ్ యాదవ్‌ను ఇటీవల కన్నౌజ్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కన్నౌజ్ ఎస్‌పీ నేతల ఒత్తిడి మేరకు అఖిలేష్ ఇక్కడి నుంచి పోటీచేసే విషయమై ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం.
ఏప్రిల్ 25న కన్నౌజ్ అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయవచ్చని నేతలు అంటున్నారు. కన్నౌజ్ సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోట. అయితే గత రెండు దఫాల్లో ఈ స్థానం నుంచి బీజేపీ విజయం సాధించింది. 2019లో డింపుల్ యాదవ్ ఈ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. తాజాగా పార్టీ ఇక్కడ నుండి తేజ్ ప్రతావ్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే ఇప్పుడు అఖిలేష్ తమ కంచుకోటను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం తేజ్ ప్రతాప్ యాదవ్ పేరు ప్రకటించిన తరువాత, స్థానిక నేతల అఖిలేష్ యాదవ్‌పై ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఈ నేపధ్యంలో అఖిలేష్ తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తేజ్ ప్రతాప్ యాదవ్‌తో చర్చించనున్నారట. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గరిష్ట సీట్లు దక్కించుకోవాలని భావిస్తున్న అఖిలేష్ కన్నౌజ్ నుంచి పోటీ చేయడం ఖాయమనే మాట వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment