లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, దివంగత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కన్నౌజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
తన అభ్యర్థిత్వంతో పాటుగా ఆస్తులు, అప్పులకు సంబంధించిన అఫిడవిట్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. తన వద్ద రూ. 26.34 కోట్ల ఆస్తులు ఉన్నాయని, తన జీవిత భాగస్వామి డింపుల్ యాదవ్ ఆస్తుల విలువ రూ.15 కోట్లకు పైగా ఉన్నట్లు అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. దీంతో ఆయన మొత్తం కుటుంబ ఆస్తులు రూ.41.88 కోట్లకు చేరాయి.
అఖిలేష్ యాదవ్ తన అఫిడవిట్‌లో తన భార్య డింపుల్ యాదవ్ తనకు రూ. 54 లక్షల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే తన వద్ద 1.60 లక్షల విలువైన మట్టి, పింగాణి పాత్రలు ఉన్నట్లు వెల్లడించడం విశేషం. అఖిలేష్ చేతిలో రూ.25.61 లక్షల నగదు, రూ.5.41 కోట్ల బ్యాంకు వాల్ట్‌లు ఉన్నాయి.
లిక్విడ్ క్యాష్ రూపంలో డింపుల్ యాదవ్ వద్ద రూ.5.72 లక్షలు, వివిధ బ్యాంకింగ్ సంస్థల్లో రూ.3.75 కోట్లు ఉన్నాయి. ఆమె వద్ద 2.77 కేజీల బంగారంతో కూడిన రూ.59.76 లక్షల విలువైన నగలు ఉన్నాయి. ఇక అఖిలేష్ చరాస్తుల్లో రూ.9.12 కోట్లు, స్థిరాస్తుల్లో రూ.17.22 కోట్లు పెట్టుబడి పెట్టారు. కాగా, డింపుల్ చరాస్తుల విలువ 5.10 కోట్లు. ఆమెకు రూ.10.44 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment