owes
-
నా భార్య రూ.54 లక్షల అప్పుంది: మాజీ సీఎం
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, దివంగత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కన్నౌజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు.తన అభ్యర్థిత్వంతో పాటుగా ఆస్తులు, అప్పులకు సంబంధించిన అఫిడవిట్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. తన వద్ద రూ. 26.34 కోట్ల ఆస్తులు ఉన్నాయని, తన జీవిత భాగస్వామి డింపుల్ యాదవ్ ఆస్తుల విలువ రూ.15 కోట్లకు పైగా ఉన్నట్లు అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. దీంతో ఆయన మొత్తం కుటుంబ ఆస్తులు రూ.41.88 కోట్లకు చేరాయి.అఖిలేష్ యాదవ్ తన అఫిడవిట్లో తన భార్య డింపుల్ యాదవ్ తనకు రూ. 54 లక్షల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే తన వద్ద 1.60 లక్షల విలువైన మట్టి, పింగాణి పాత్రలు ఉన్నట్లు వెల్లడించడం విశేషం. అఖిలేష్ చేతిలో రూ.25.61 లక్షల నగదు, రూ.5.41 కోట్ల బ్యాంకు వాల్ట్‌లు ఉన్నాయి.లిక్విడ్ క్యాష్ రూపంలో డింపుల్ యాదవ్ వద్ద రూ.5.72 లక్షలు, వివిధ బ్యాంకింగ్ సంస్థల్లో రూ.3.75 కోట్లు ఉన్నాయి. ఆమె వద్ద 2.77 కేజీల బంగారంతో కూడిన రూ.59.76 లక్షల విలువైన నగలు ఉన్నాయి. ఇక అఖిలేష్ చరాస్తుల్లో రూ.9.12 కోట్లు, స్థిరాస్తుల్లో రూ.17.22 కోట్లు పెట్టుబడి పెట్టారు. కాగా, డింపుల్ చరాస్తుల విలువ 5.10 కోట్లు. ఆమెకు రూ.10.44 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. -
ఐటీ రంగం నెత్తిన మరో పిడుగు: టెకీల గుండెల్లో గుబులు
సంక్షోభంలో ఉన్న భారతీయ ఐటీ రంగానికి చెందిన తాజా నివేదిక ఒకటి సంచలనం రేపుతోంది. 2024 ఆర్థిక సంవత్సరం కూడా అతలాకుతలమేనని ప్రఖ్యాత ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గాన్ విశ్లేషకులు బాంబు పేల్చారు. అయితే 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్ట్స్ డీల్స్ మెరుగుపడే అవకాశం ఉందని భావించారు. ఇటీవలి తమ పరిశీలనలో భారత ఐటీ రంగంలో చెప్పుకోదగిన పురోగతి కనిపించలేదంటూ నిరాశను ప్రకటించారు. దీంతో ఐటీపై తమ నెగటివ్ ధోరణిని కొనసాగిస్తామని జేపీ మోర్గాన్ విశ్లేషకులు అంకుర్ రుద్ర, భావిక్ మెహతా తాజా నోట్లో తెలిపారు. మరోవైపు సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో ఐటీ కంపెనీల ఆదాయాలు నిరుత్సాహకరంగా ఉండ బోతున్నాయన్న అంచనాలున్నాయి. ఈ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, గైడెన్స్‌ను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తారని జేపీ మోర్గాన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2024 ని "వాష్అవుట్"గా ఇన్వెస్టర్లు పేర్కొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ 2025 వ్యూహంపై దృష్టి పెట్టాలని వారు భావిస్తారన్నారు. (స్పెషల్ఫీచర్తో డైసన్ హెడ్‌ఫోన్స్ వచ్చేశాయ్..యాపిల్‌కు కష్టమే!) వివిధ పరిశ్రమల ఎగ్జిక్యూటివ్‌లతో జరిగిన సమావేశంలో ఎలాంటి ఆశావమదృక్పథం కనపించలేదన్నారు డిమాండ్ ఇంకా పుంజుకోనందున్న ఐటీ పరిశ్రమపై తమ దృక్పథం బేరిష్‌గా ఉంది. మొత్తం పరిస్థితి మునుపటి త్రైమాసికంతో పోలిస్తే పరిస్థితి మెరుగ్గాలేదని వెల్లడించారు. అలాగే దీర్ఘకాలం అధిక వడ్డీరేట్లు కొనసాగితే ఆర్థిక వృద్ధి మందమనం భయాలతొ పరిస్థితి ప్రతికూలమని ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో ,హెచ్‌సిఎల్‌టెక్‌తో సహా అన్ని ప్రధాన ఐటి సంస్థలు గతంలోనే హెచ్చరించాయి, ఎక్కువ యుఎస్ బేస్డ్ క్లయింట్లు కావడంతో తమ ఐటి వ్యయాన్ని తగ్గించడం, కాంట్రాక్టులను కూడా రద్దు లేదా ఆలస్య మవుతున్నాయని తెలిపాయి. ( క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఆదాయంపై బీవోబీ సంచలన అంచనాలు) ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు FY24 ఒక వాష్అవుట్ అని భావించారనీ, రీబౌండ్ ఆశలతో FY25కి దృష్టి మరల్చారని విశ్లేషకులు చెప్పారు. అలాగే గత మూడు నెలల్లో బ్లూ-చిప్ నిఫ్టీ 50, నిఫ్టీ IT ఇండెక్స్‌ను అధిగమించిందనికూడా వివరించారు. వచ్చే వారం టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ తమ ఫలితాలను ప్రకటనుంచ నున్నారు. ఈసమయంలో జేపీ మోర్గన్ నివేదిక కీలకంగా మారింది. అంతేకాదు త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని ఎదురుచూస్తున్న టెకీలకు నిరాశే ఎదురైంది. (గ్లాస్ సీలింగ్ బ్రేక్స్:ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా) కాగా ఇప్పటికే భారత్ సహా, దిగ్గజ ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. ఆదాయాలు క్షీణించాయి. ఫలితంగా ఉద్యోగ నియామకాలు గణనీయంగా పడి పోయాయి. ప్రాజెక్టులు లేక బెంచ్ మీద ఉద్యోగులను చాలామందిని ఇంటికి పంపించేశాయి. ఆన్‌బోర్డింగ్ జాప్యంతోపాటు, క్యాంపస్ రిక్రూట్మెంట్లపై దెబ్బ పడింది. ఐటీ, టెక్ కంపెనీల్లో వేలాదిమంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. (ICC పురుషుల ప్రపంచ కప్ 2023: ఫ్యాన్స్‌కు ఎయిర్టెల్ గుడ్ న్యూస్) -
Chandrababu Naidu: ఆర్టీసీకి ‘చంద్రన్న భజన’ బకాయి రూ.78.36 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బీసీలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వారిని మరింత చైతన్యం చేసేందుకు బుధవారం విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సదస్సు పైనా ఈనాడు పత్రిక విషపు రాతలు రాసింది. ఈ సదస్సుకు ముందుగానే డబ్బులు చెల్లించి, ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొన్నప్పటికీ, ‘వైఎస్సార్సీపీకి ఆర్టీసీ జీ హుజూర్’ అంటూ బండలేసింది. ఇదే ఈనాడుకు ఆనాడు చంద్రబాబు పేరిట పెట్టిన ‘జయము జయము చంద్రన్న’ అనే భజన కార్యక్రమానికి అప్పనంగా ఆర్టీసీ బస్సులను తిప్పిన విషయం పట్టించుకోదు. ఆ కార్యక్రమం కోసం టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీకి బకాయి పెట్టిన మొత్తం రూ.78.36కోట్లు. ‘జయహో బీసీ’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ముందుగానే డబ్బులు చెల్లించి ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి, అబద్ధాలు రాసింది. ఈనాడు పత్రిక కడుపుమంట అలాంటిది. ఇంతకీ చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్టీసీ దుస్థితి, ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటో ఓసారి పరిశీలిద్దాం... పైసా అద్దె చెల్లించకుండానే.. ఆర్టీసీ అందరికీ బస్సులు అద్దెకిస్తుంది. వ్యక్తులకు, సంస్థలకు, వేడుకలకు... ఇలా ముందుగా అద్దె చెల్లిస్తే బస్సులు పంపుతుంది. ప్రభుత్వం కూడా ఇలా అద్దెకు బస్సులు తీసుకుంటుంది. పార్టీలూ తీసుకుంటాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రచార కార్యక్రమాల కోసం ఆర్టీసీ బస్సులను ఇష్టానుశాతం వాడుకున్నారు. నిబంధనల ప్రకారం ఆర్టీసీ బస్సులను ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు తీసుకుంటే అందుకు అద్దె చెల్లించాలి. టీడీపీ ఐదేళ్లలో ఏనాడూ దీనిని పట్టించుకోలేదు. పోలవరం సందర్శన కోసం 19,923 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. అందుకోసం ఆరీ్టసీకి రూ.65.79 కోట్లు చెల్లించాలి. అక్కడికి బస్సుల్లో తరలించిన వారితో చంద్రన్న భజన పాటలు పాడించారు. అయినా, 2019లో టీడీపీ అధికారాన్ని కోల్పోయే వరకు ఆ బకాయి చెల్లించనే లేదు. కట్టని రాజధానిని చూపించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజల్ని బలవంతంగా అమరావతికి ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. అందుకోసం 1,518 బస్సులను వాడుకున్నారు. ఆ బస్సుల అద్దె బకాయి రూ.5.36 కోట్లు చెల్లించనే లేదు. ‘దివ్య దర్శనం’ పేరుతో టీడీపీ ప్రభుత్వం 1,984 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంది. అందుకు చెల్లించాల్సిన అద్దె రూ.7.21 కోట్లు. ఇదీ చెల్లించలేదు. మొత్తం మీద చంద్రబాబు ఆరీ్టసీకి పెట్టిన బకాయి రూ.78.36 కోట్లు. కానీ ఈనాడు పెన్ను ఈ వాస్తవం రాయదు. ఎందుకంటే ఆర్టీసీ సొమ్మును అప్పనంగా వాడుకుంది వారి చంద్రబాబు కదా. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో కూరుకుపోయినా, అప్పుల పాలైపోయినా పర్వాలేదు. చంద్రబాబు భజన చేస్తే చాలన్నది దాని సిద్ధాంతం. అద్దె ముందే చెల్లించడం వైఎస్సార్సీపీ విధానం ప్రస్తుతం ఆర్టీసీపై వైఎస్సార్సీపీ ఒక్క రూపాయి కూడా భారం మోపడంలేదు. పార్టీ కార్యక్రమాలకు అవసరమైతే నిరీ్ణత అద్దెను ముందుగానే చెల్లించి మరీ బస్సులను తీసుకుంటోంది. ఈ ఏడాది జూలైలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీకి 1,823 బస్సుల కోసం రూ.3.38కోట్లు ముందుగానే చెల్లించింది. విజయవాడలో బుధవారం నిర్వహించిన ‘జయహో బీసీ’ సభ కోసం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి 1,460 ఆర్టీసీ బస్సులను దాదాపు రూ.7 కోట్లకు అద్దెకు తీసుకుంది. అయినా సరే ‘ఈనాడు’ మాత్రం ప్రభుత్వానికి ఆర్టీసీ జీ హుజూర్... అంటూ దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని మోసగించేందుకు యత్నించింది. స్వామి భక్తి అంటూ ఇష్టారీతిన పదాలు వాడింది. ఇదే స్వామి భక్తి చంద్రబాబు హయాంలో అప్పనంగా ఇచ్చినప్పుడు ఈనాడు గమనించలేకపోయిందా? కాదు.. చూడనట్లే ఉంది. ఇష్టం వచ్చినట్లుగా బస్సులు వాడుకొని, అద్దె ఎగ్గొట్టిన చంద్రబాబు దందాను మరుగున పెట్టి, ముందస్తుగా డబ్బు చెల్లించి ఆర్టీసీకి ఆదాయాన్ని సమకూర్చిన వైఎస్సార్సీపీపై అక్కసు వెళ్లగక్కింది. చదవండి: వారికి జీతాలు పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు -
పంజాబ్‌లో పవర్ రచ్చ,ముందు మీ 8 లక్షల బిల్లు చెల్లించండి సిద్ధూ...
చండీగడ్: ప్రస్తుతం విద్యుత్త్ కొరత సమస్యతో పంజాబ్ రాష్ట్రం ఇబ్బందులు పడుతోంది. ఇక ఈ అంశంపై అమరీందర్ పాలన సరిగా లేదని అదే పార్టీకి చెందిన నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధూ ఇటీవల ఫైర్ అయిన సంగతి తెలిసిందే. విద్యుత్త్ సమస్యలపై అంతలా విరుచుకుపడ్డ సిద్ధూ తన ఇంటి కరెంట్ బకాయిలు చెల్లించడం మారిచారన్న విమర్శలు వస్తున్నాయి. అమృత్‌సర్‌లో ఉన్న సిద్ధూ ఇంటికి కరెంటు బిల్లు బాకీ ఉన్నట్లు తెలియడంతో ఈ అంశం ఇప్పుడు విపక్షాలకు అస్త్రంలా దొరికింది. ఈ కాంగ్రెస్ నేత మొత్తం రూ.8,67,540 కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉంది. అయితే బిల్ పేమెంట్‌కు జూన్ 2 చివరి రోజు కాగా ఇంతవరకు ఆయన చెల్లించలేదు. దీని గురించి ఇప్పటి వరకు సిద్ధూ ఏమీ మాట్లాడలేదు. ఇదిలా ఉండగా ఆప్ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల కరెంటును ఉచితంగా అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనడం విశేషం. 2019లో రాజీనామ చేసిన సమయంలో ఆ శాఖను సిద్దూకే కేటాయించే ప్రయత్నం చేశారు. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్సైట్ ప్రకారం.. అమృత్‌సర్‌లోని సిద్ధూ ఇంటికి రూ. 8,67,540 విద్యుత్త్ బకాయిలు ఉండగా ఇంకా చెల్లించలేదని తెలిపింది. అసలు ఈ కరెంట్ కథేంటంటే.. గత సంవత్సరం నుంచి సిద్దూ ఇంటి కరెంట్ బిల్లు విషయంలో 17 లక్షలకు పైగా బాకీ పడ్డాడు. కాగా అతను మార్చిలో 10 లక్షలు చెల్లించగా, ప్రస్తుతం అతని బకాయిలు దాదాపు 9 లక్షలకు చేరుకున్నాయని వారు తెలిపారు. Punjab | Congress' Navjot Singh Sidhu allegedly owes Rs 8.67 lakh in pending bill to state power utility I'm not aware of the issue. Sub Divisional Officers must have known. No special relaxation was given to him. We'll investigate the issue: Chief engineer, Power Dept, Amritsar pic.twitter.com/y8xdMmsfNb — ANI (@ANI) July 3, 2021 -
వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికోసం విధించిన లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేకమంది వలస కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి. కన్నవూరులో, కన్నవారి చెంత కలో గంజో తాగి బతుకుదామన్న ఆశలో పిల్లాపాపలతో ఊరికి బాట పట్టిన దృశ్యాలు సంచలనంగా మారాయి. అంతేకాదు ఈజీవన పయనంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్న వైనం మనసున్న మనిషిని కదిలిస్తున్నాయి. రోజు రోజుకీ వలస కార్మికుల అవస్థలు, వెతల గాథలు, వీడియోలు కంటతడిపెట్టిస్తున్నాయి. పసికందులు, గర్భిణీలు, వృద్ధులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. బిస్కట్ పాకెట్ల కోసం యువకులు కుస్తీలు పడుతున్న తీరు వారి ఆకలి పోరుకు అద్దంపడుతోంది. మరికొంతమంది స్వగ్రామానికి వెళ్లేందుకు అనుతించాలంటూ ఇంకా పోరుబాటలోనే ఉన్నారు. అలాంటి వీడియోలు మీకోసం.. (‘పీఏం కేర్స్’ కేటాయింపులపై చిదంబరం సందేహం) — Piyush Rai (@Benarasiyaa) May 14, 2020 भूख से संघर्ष। (बिहार के कटिहार स्टेशन पर बिस्किट के लिए जंग) pic.twitter.com/noGCiOFokf — Narendra nath mishra (@iamnarendranath) May 14, 2020 #Gujarat A group of angry migrant workers blocked highway in Gandhidham, Kutch district demanding permission to travel to their native states in UP and Bihar @DeccanHerald pic.twitter.com/2rR1ub2U37 -
కరీంనగర్ జిల్లాకు రుణపడి ఉంటా
కరీంనగర్: తనను ఆదరించి అభిమానిస్తున్న కరీంనగర్ జిల్లాకు జన్మంతా రుణపడి ఉంటానని సినీ సంగీత దర్శకుడు భీమ్స్ అన్నారు. ఆదివారం కరీంనగర్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్వేత హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఈ జిల్లాకు చెందిన సినీ దర్శకులు సంపత్ నంది తనను ప్రోత్సాహించి గాలిపటం, బెంగాల్ టైగర్ తదితర చిత్రాలకు అవకాశం ఇచ్చారన్నారు. ఈ అవకాశాలతోనే తనకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. జిల్లాలోని కళాకారులకు, వాయిద్యకారులకు, పాటల రచయితలకు సినీ రంగంలో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఏంజిల్, నక్షత్రం, గరడాబేగ, పేపర్‌బాయ్, నా పేరే రాజు తదితర చిత్రాలను సంగీతం అందిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ చిరంజీవి, ఫ్రీజ్ సినీమా హీరో సంపత్ మాట్లాడుతూ కరీంనగర్లో జరిగిన సంఘట కథాంశంగా త్వరలో సినిమా నిర్మిస్తున్నట్లు, ఆందులో హీరోగా నటిస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమా ఘాటింగ్ కూడ 75 శాతం కరీంనగర్ జిల్లాలోని వివిధ లోకేషన్లలో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో తెలంగాణ సినిమా ప్రొటక్షన్ ఫోరం చైర్మెన్ సొల్లు అజయ్‌వర్మ, సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు కాసరాజు, రవితేజ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు రుద్ర భూపతి, ఫ్రీజ్ సినిమా దర్శకుడు సతీశ్ తదతరులు పాల్గొన్నారు. -
చిక్కుల్లో ఆపిల్
ఫ్లోరిడా: అసలే అమ్మకాలు పడిపోయి.. కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు తంటాలు పడుతున్న ఆపిల్ సంస్థను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా తన కాపీరేట్ ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి వేల కోట్ల దా వావేశాడు. ఐఫోన్ ఆలోచన తనదేనని.. టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తన ఐడియాను కొట్టేసిందని పోరాటానికి దిగాడు. ఫ్లోరిడాకు చెందిన థామస్ రాస్ ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో ఈ వారం వ్యాజ్యం దాఖలు చేశాడు. ఆపిల్ సంస్థ తన ఐడియాను హైజాగ్ చేసిందని తద్వారా వేల కోట్లు ఆర్జిస్తోందని ఆరోపించాడు. ఇందుకు గాను తనకు సుమారు రూ. 74,177 కోట్లు (11బిలియన్ డాలర్లు) నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కోర్టు కెక్కాడు. అలాగే ఆపిల్ ప్రపంచ వ్యాప్త అమ్మకాల్లో కనీసం 1.5 శాతం ఒక సహేతుకమైన రాయల్టీ గా చెల్లించాలని కోరుతున్నాడు. 1992 లోనే ఐ ఫోన్ డిజైన్ ను రూపొందించానని వాదించాడు. అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్ ఆఫీసు అవసరం ఫీజు చెల్లించడంలో విఫలమైన కారణంగా 1995 లో ఈ పేటెంట్ అప్లికేషన్ రద్దయిందని పేర్కొన్నాడు. ఈ డిజైన్ నమూనా కాపీని కూడా జత చేశాడు. గత ఏడాది తన డిజైన్ ను కాపీ రైట్ చేయించానని లా సూట్ లో పేర్కొన్నాడు. తన మేధో సంపత్తిని చట్ట విరుద్ధంగా యాపిల్ ఉత్పత్తుల్లో, ప్యాకేజింగ్ లో వాడుకుంటోందని ఆరోపించాడు. తన సొంత ఆవిష్కరణలు కాకుండా డంప్ స్టర్ డైవింగ్ (ఒక కంప్యూటర్ నెట్ వర్క పై దాడి చేసేందుకు వాడబడే సమాచారాన్ని పొందడానికి ఉపయోగించే ఒక టెక్నిక్) కు పాల్పడుతోందన్నాడు. తనకు యాపిల్ నుంచి ఎలాంటి వివరణ కానీ, ఖండనగానీ రాలేదని తెలిపాడు. కాగా 2001 ఎంపీ3 మ్యూజిక్ ప్లేయర్ తో ఐపాడ్ లాంచయింది. అనంతరం ఆరేళ్ల తరువాత 2007 లో ఐ ఫోన్ ను ప్రవేశపెట్టారు. అయితే రాస్ పిటిషన్ పై దీనిపై స్పందించేందుకు ఆపిల్ నిరాకరించింది. -
బంగ్లా బోర్డర్ ను మూసేస్తాం!
గువాహటి: ఎన్నికల్లో తామిచ్చిన హామీల మేరకు రాష్ట్రానికి బంగ్లాదేశ్ కు మధ్య ఉన్న సరిహద్దుని మూసివేస్తామని, ప్రజల గుర్తింపు కోసం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)ను పూర్తి చేస్తామని అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న సర్బానంద సోనోవాల్ తెలిపారు. మొత్తం 263 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బంగ్లాదేశ్ బోర్డర్లో ఇప్పటికే 224 కిలోమీటర్ల పాటు ఫెన్సింగ్ ఉండగా.. 40 కిలో మీటర్ల విస్తీర్ణం నదీ తీరప్రాంతం ఉంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న నదీతీర ప్రాంతాల్లో సైతం చొరబాటుకు అడ్డుకట్టవేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ప్రారంభమయిన ఎన్ఆర్సీ రిజిస్ట్రేషన్లను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. 2014లో సుప్రీం ఇచ్చిన తీర్పు మేరకు ఈ ఏడాది జనవరి ఒకటిలోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాల్సివుంది. ఎన్ఆర్సీ ప్రక్రియ పూర్తయితే 1971 తర్వాత అసోంలోకి ప్రవేశించిన వలస ప్రాంతాలకు చెందిన వారు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల్లో బీజేపీ విజయంపై మాట్లాడిన సోనోవాల్ 15 ఏళ్ల కాంగ్రెస్ అవినీతి పాలన వల్లే తాము విజయం సాధించినట్లు వివరించారు. స్థానిక పార్టీలైన అసోం గణ పరిషత్(ఏజీపీ), బోడో పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్)లతో జోడీ కట్టడం తమకు కలిసొచ్చిందని సోనోవాల్ తెలిపారు. బీజేపీకి పోలైన ఓట్లలో 20 శాతం మైనారిటీలు, స్థానిక అస్సామిలవి ఉన్నట్లు చెప్పారు. మే 24న సర్బానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరించనున్నారు.