కరీంనగర్ జిల్లాకు రుణపడి ఉంటా
కరీంనగర్: తనను ఆదరించి అభిమానిస్తున్న కరీంనగర్ జిల్లాకు జన్మంతా రుణపడి ఉంటానని సినీ సంగీత దర్శకుడు భీమ్స్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్వేత హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఈ జిల్లాకు చెందిన సినీ దర్శకులు సంపత్ నంది తనను ప్రోత్సాహించి గాలిపటం, బెంగాల్ టైగర్ తదితర చిత్రాలకు అవకాశం ఇచ్చారన్నారు. ఈ అవకాశాలతోనే తనకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. జిల్లాలోని కళాకారులకు, వాయిద్యకారులకు, పాటల రచయితలకు సినీ రంగంలో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఏంజిల్, నక్షత్రం, గరడాబేగ, పేపర్‌బాయ్, నా పేరే రాజు తదితర చిత్రాలను సంగీతం అందిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ చిరంజీవి, ఫ్రీజ్ సినీమా హీరో సంపత్ మాట్లాడుతూ కరీంనగర్‌లో జరిగిన సంఘట కథాంశంగా త్వరలో సినిమా నిర్మిస్తున్నట్లు, ఆందులో హీరోగా నటిస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమా ఘాటింగ్ కూడ 75 శాతం కరీంనగర్ జిల్లాలోని వివిధ లోకేషన్లలో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో తెలంగాణ సినిమా ప్రొటక్షన్ ఫోరం చైర్మెన్ సొల్లు అజయ్‌వర్మ, సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు కాసరాజు, రవితేజ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు రుద్ర భూపతి, ఫ్రీజ్ సినిమా దర్శకుడు సతీశ్ తదతరులు పాల్గొన్నారు.