Chandrababu Naidu: ఆర్టీసీకి ‘చంద్రన్న భజన’ బకాయి రూ.78.36 కోట్లు  | TDP Government Owes Rs 78 36 Crore To RTC | Sakshi
Sakshi News home page

Chandrababu Naidu: ఆర్టీసీకి ‘చంద్రన్న భజన’ బకాయి రూ.78.36 కోట్లు 

Published Thu, Dec 8 2022 6:33 PM | Last Updated on Thu, Dec 8 2022 7:23 PM

TDP Government Owes Rs 78 36 Crore To RTC - Sakshi

ఫైల్‌ఫోటో

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బీసీలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వారిని మరింత చైతన్యం చేసేందుకు బుధవారం విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సదస్సు పైనా ఈనాడు పత్రిక విషపు రాతలు రాసింది. ఈ సదస్సుకు ముందుగానే డబ్బులు చెల్లించి, ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొన్నప్పటికీ, ‘వైఎస్సార్‌సీపీకి ఆర్టీసీ జీ హుజూర్‌’ అంటూ బండలేసింది.

ఇదే ఈనాడుకు ఆనాడు చంద్రబాబు పేరి­ట పెట్టిన ‘జయము జయము చంద్రన్న’ అనే భ­జన కార్యక్రమానికి అప్పనంగా ఆర్టీసీ బస్సులను తిప్పి­న విషయం పట్టించుకోదు. ఆ కార్యక్రమం కో­సం టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీకి బకాయి పెట్టిన మొ­త్తం రూ.78.36కోట్లు. ‘జయహో బీసీ’ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ ముందుగానే డబ్బులు చెల్లించి ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుంది. ఈ విషయా­న్ని దాచిపెట్టి, అబద్ధాలు రాసింది. ఈనాడు పత్రిక క­డుపుమంట అలాంటిది. ఇంతకీ చంద్రబాబు ప్ర­భు­త్వం­లో ఆర్టీసీ దుస్థితి, ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్ర­భుత్వంలో పరిస్థితి ఏమిటో ఓసారి పరిశీలిద్దాం... 

పైసా అద్దె చెల్లించకుండానే.. 
ఆర్టీసీ అందరికీ బస్సులు అద్దెకిస్తుంది. వ్యక్తులకు, సంస్థలకు, వేడుకలకు... ఇలా ముందుగా అద్దె చెల్లిస్తే బస్సులు పంపుతుంది. ప్రభుత్వం కూడా ఇలా అద్దెకు బస్సులు తీసుకుంటుంది. పార్టీలూ తీసుకుంటాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రచార కార్యక్రమాల కోసం ఆర్టీసీ బస్సులను ఇష్టానుశాతం వాడుకున్నారు. నిబంధనల ప్రకారం ఆర్టీసీ బస్సులను ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు తీసుకుంటే అందుకు అద్దె చెల్లించాలి.

టీడీపీ ఐదేళ్లలో ఏనాడూ దీనిని పట్టించుకోలేదు. పోలవరం సందర్శన కోసం 19,923 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. అందుకోసం ఆరీ్టసీకి రూ.65.79 కోట్లు చెల్లించాలి. అక్కడికి బస్సుల్లో తరలించిన వారితో చంద్రన్న భజన పాటలు పాడించారు. అయినా,  2019లో టీడీపీ అధికారాన్ని కోల్పోయే వరకు ఆ బకాయి చెల్లించనే లేదు. కట్టని రాజధానిని చూపించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజల్ని బలవంతంగా అమరావతికి ఆర్టీసీ బస్సుల్లో తరలించారు.

అందుకోసం 1,518 బస్సులను వాడుకున్నారు. ఆ బస్సుల అద్దె బకాయి రూ.5.36 కోట్లు చెల్లించనే లేదు. ‘దివ్య దర్శనం’ పేరుతో టీడీపీ ప్రభుత్వం 1,984 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంది. అందుకు చెల్లించాల్సిన అద్దె రూ.7.21 కోట్లు. ఇదీ చెల్లించలేదు. మొత్తం మీద చంద్రబాబు ఆరీ్టసీకి పెట్టిన బకాయి రూ.78.36 కోట్లు. కానీ ఈనాడు పెన్ను ఈ వాస్తవం రాయదు. ఎందుకంటే ఆర్టీసీ సొమ్మును అప్పనంగా వాడుకుంది వారి చంద్రబాబు కదా. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో కూరుకుపోయినా, అప్పుల పాలైపోయినా పర్వాలేదు. చంద్రబాబు భజన చేస్తే చాలన్నది దాని సిద్ధాంతం.

అద్దె ముందే చెల్లించడం వైఎస్సార్‌సీపీ విధానం 
ప్రస్తుతం ఆర్టీసీపై వైఎస్సార్‌సీపీ ఒక్క రూ­పా­యి కూడా భారం మోపడంలేదు. పార్టీ కా­ర్య­క్ర­మాలకు అవసరమైతే నిరీ్ణత అద్దెను ముందు­గానే చెల్లించి మరీ బస్సులను తీసుకుంటోంది. ఈ ఏడాది జూలైలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి 1,823 బస్సుల కోసం రూ.3.38కోట్లు ముందుగానే చెల్లించింది. విజయవాడలో బుధవారం నిర్వహించిన ‘జ­య­హో బీసీ’ సభ కోసం రాష్ట్రంలో వివిధ ప్రాం­తాల నుంచి 1,460 ఆర్టీసీ బస్సులను దాదాపు రూ.7 కోట్లకు అద్దెకు తీసుకుంది.  అయినా సరే ‘ఈనాడు’ మాత్రం ప్రభుత్వానికి ఆర్టీసీ జీ హుజూర్‌... అంటూ దుష్ప్ర­చా­రం చేస్తూ ప్రజల్ని మోసగించేందుకు య­త్నిం­­చింది.

స్వామి భక్తి అంటూ ఇష్టారీతిన పదాలు వాడింది. ఇదే స్వామి భక్తి చంద్రబాబు హయాంలో అప్పనంగా ఇచ్చినప్పుడు ఈ­నాడు గమనించలేకపోయిందా? కాదు.. చూ­డనట్లే ఉంది. ఇష్టం వచ్చినట్లుగా బస్సు­లు వాడుకొని, అద్దె ఎగ్గొట్టిన చంద్రబాబు దందాను మరుగున పెట్టి, ముందస్తుగా డబ్బు చెల్లించి ఆర్టీసీకి ఆదాయాన్ని సమకూర్చిన వైఎస్సార్‌సీపీపై అక్కసు వెళ్లగక్కింది.
చదవండి: వారికి జీతాలు పెంచుతూ ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement