![BJP MLA comes out to vote playing cymbal and Dhol](/styles/webp/s3/article_images/2024/05/13/kanpur.jpg.webp?itok=XVrgqNik)
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ నాలుగో దశ పోలింగ్ సందడిగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌కు చేరుకోవడం ప్రారంభించారు. ఈ దశలో యూపీలోని 13 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో మొత్తం 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు.
కాన్పూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మైతాని సందడి చేశారు. చిడతలు, తాళాలు, డోలు వాయిస్తూ ఊరేగింపుగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటర్లందరూ ఉత్సాహంగా బయటకు వచ్చి ఓటేసేలా చైతన్యపరచడానికి ఇలా చేసినట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment