లక్నో: దేశంలో మూడోదశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటుహక్కును సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్‌లోని సైఫాయ్‌లో ఓటు వేసిన తర్వాత, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ.. మెయిన్‌పురి అభ్యర్థి డింపుల్ యాదవ్ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై బీజేపీని ఉద్దేశించి డింపుల్ యాదవ్ వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీలో భారీ లోపం ఉందని ఆమె ఆరోపించారు. అంతే కాకుండా బీజేపీ ప్రతి వర్గాల ప్రజలు నిర్లక్ష్యంగా భావిస్తున్నారని అన్నారు. బీజేపీ హయాంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ నిరంతరం పడిపోతోంది అన్నారు.
10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏ పనీ చేయలేకపోయిందని, ప్రభుత్వం తన వైఫల్యాన్ని దేశం మొత్తంలో వ్యాపింపజేసిందని డింపుల్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారని అన్నారు. రాజకీయ భావజాలం, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడాల్సిన అవసరం ఇప్పుడు చాలా అవసరమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment